NewOrbit
తెలంగాణ‌ న్యూస్

ఈత సరదా ఆరు కుటుంబాల్లో విషాదం.. కాపాడేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడు సహా.. ఎక్కడంటే..?

Share

హైదరాబాద్ జవహర్ నగర్ లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగిన ఆరుగురు దుర్మరణం చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్దులను ఉపాధ్యాయుడు టూర్ లాగా తీసుకువెళ్లారు. సరదాాగా ఈత కొట్టడానికి ఎర్రగుంట చెరువులోకి అదుగురు గురు విద్యార్ధులు దిగారు. విద్యార్ధులు నీటిలో మునిగిపోతుండగా, కాపాడేందుకు ఉపాధ్యాయుడు కూడా చెరువులోకి దిగారు. నీటిలో మునిగిపోతున్న విద్యార్ధులు అందరు భయంతో ఉపాధ్యాయుడిని పట్టుకున్నారు. దీంతో వాళ్లందరినీ ఒకే సారిగా బయటకు తీసుకురాలేక అందరూ నీటిలో మునిగిపోయారు.

 

విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన విద్యార్దులు అందరూ 12 నుండి 14 ఏళ్ల వయసు గల వారని సమాచారం. మృతులు నగరంలోని కాచిగూడ నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు ఇస్మాయిల్, జాఫర్, సోహెల్, రియాజ్, అయాన్, ఉపాధ్యాయుడు యోహాన్ గా గుర్తించారు.

Advertisements

Share

Related posts

Kiara advani: చైల్డ్ సైకాలజీ స్టడీ చేసేదాన్ని… కియారా అద్వానీ

GRK

Mega Fans: “మెగా” అభిమానుల సత్తా ఎంత..!?జగన్ ని దించగలరా..!?

Srinivas Manem

Sarkaru Vaari Paata: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేశ్ కోసం అతిథిగా వచ్చే స్టార్ హీరో ఆయనేనా..!

GRK