NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

High Alert: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన .. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్

Share

High Alert: తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఒక్క సారిగా కొంత మేరకు కుంగింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. మహారాష్ట్ర వైపు నుండి 356 మీటర్ల సమీపంలో బీ – బ్లాకులోని 18,19,20,21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు డ్యామ్ పరిసరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పై నుండి రాకపోకలను నిలిపివేశారు. ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులు బ్యారేజీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుంగిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. అటు వైపు ఎవరూ రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలంలో 2019 లో మేడిగట్టు వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయంలో ఎగువ నుండి జలాశయానికి 25వేల క్యూసెక్టుల వరకు ప్రవాహం వస్తుండగా, 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు ఇఇ తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న క్రమంలోనే మరి కొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసారు.

16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీ లో సంఘటన జరిగే సమయంలో 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజనీర్ లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. తొలుత 12 గేట్లు, ఆ తర్వాత వాటిని 46 కు పెంచి దిగువకు నీటిని విడుదల చేశారు. దాదాపు 50వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీనిపై డ్యామ్ ఇంజనీర్ లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహాదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత ఏడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యామ్ ఎదుర్కొంది. నాడు రాని శబ్దాలు ఇప్పుడు రావడం పై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసాంఘీక శక్తుల ప్రమేయం ఏమైనా ఉండొచ్చని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజనీర్ లను ఆదేశించినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. డ్యామ్ నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థ (ఎల్ అండ్ టీ) పరిధిలోనే ఉన్నందున అవసరమైన మరమ్మత్తులు ఉంటే చేపడతామన్నారు.

Telangana Assembly Polls: కోదాడ బీఆర్ఎస్ లో భారీ కుదుపు .. మాజీ ఎమ్మెల్యే సహా పలువురు కీలక నేతలు రాజీనామా


Share

Related posts

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల‌తో బాలీవుడ్ న‌టుల‌కు సంబంధాలు..?

Srikanth A

నీలం సహానీ… జగన్ కు అంత పాజిటివ్ బూస్ట్ ఏలా అయ్యారు?

CMR

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

somaraju sharma