Suicide: అవమాన భారంతో భార్య, పిల్లలకు ఉరివేశాడు..! ఆపై తాను ఆత్మహత్య..!!

Share

Suicide:  ఓ ప్రభుద్ధుడు చేసిన తప్పుడు పని బహిర్గతం అయ్యింది. దీంతో  అవమానాన్ని తట్టుకోలేక పోయాడు. భార్య, పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Suicide: family suicide in keesara
Suicide: family suicide in keesara

సేకరించిన సమాచారం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ కు చెందిన బిక్షపతి, ఉష దంపతులు బ్రతుకుతెరువు కోసం కొన్నేళ్ల క్రితం కీసర పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీ నగర్ వచ్చి నివాసం ఉంటున్నాడు. బిక్షపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె హర్షిణి, కుమారుడు యశ్వంత్ ఉన్నారు. కాగా బిక్షపతి వారి ఇంటి పక్కన ఉండే ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తూ గురువారం రాత్రి అతనిపై దాడి చేశారు. శుక్రవారం ఉదయం పెద్ద సమక్షంలో మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు.

Read More: Murder: భార్య, కుమారుడుపై గొడ్డలితో దాడి..! భార్య మృతి, కుమారుడి పరిస్థితి విషమం – కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Suicide: family suicide in keesara
Suicide: family suicide in keesara

తెల్లవారితే పంచాయతీ జరుగుతుంది, అందరి ముందు తమ పరువు పోతుందని అనుకున్న బిక్షపతి తీవ్ర మస్థాపానికి గురైయాడు. బిక్షపతి ముందుగా భార్య, పిల్లలకు ఉరివేశాడు.  అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిక్షపతితో పాటు వారి ఇంట్లో అందరూ మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కీసర సీఐ నరేందర్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను  పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

కరోనా ఉన్నా TCS ముందడుగు.. భారీ ఎత్తున కొత్త ఉద్యోగాలు

Muraliak

శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలువు దోపిడీ..!!

sekhar

ఓ సారి మాట్లాడుకుందామా..? చంద్రబాబు – కేసీఆర్ అంతరాలోచన..!?

Srinivas Manem