NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: ఓటుకు నోటు కేసు.. సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

Share

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఓటు కు నోటు కేసు లో సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమైదైన కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేసిన సంగతి తెలిసిందే. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లి భారీ మొత్తంలో నగదుతో ప్రలోభాలకు గురి చేస్తుండగా, పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ తో పట్టుకున్నారు.

అందుకు సంబంధించిన వీడియో బహిర్గతం కావడం తీవ్ర సంచలనం అయ్యింది. ఆనాడు నమోదు చేసిన కేసుపై రేవంత్ రెడ్డి తొలుత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఈ కేసు రాదంటూ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రేవంత్ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. మరో పక్క ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడుగా చేర్చాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

Chandrababu: సుప్రీం కోర్టులో చంద్రబాబు లభించని ఊరట .. క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా


Share

Related posts

Salman Khan: IIFA అవార్డ్స్ ఫంక్షన్ లో “పుష్ప” సాంగ్ పాడిన సల్మాన్ ఖాన్..!!

sekhar

సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో మహిళా ఆర్డీఓ అరెస్టు

somaraju sharma

Road Accident: రెండు బస్సులు ఢీ .. పది మంది దుర్మరణం

somaraju sharma