తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: ఈటలకు సానుభూతి పవనాలు .. టీఆర్ఎస్ కు సవాల్.. కేసిఆర్ స్ట్రాటజీ ఇదీ..

Share

Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓ పెద్ద సవాల్ గానే నిలుస్తోంది. ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాకముందే అటు బీజెపీ, ఇటు అధికార టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై అవినీతి ముద్ర వేసి అవమానకరమైన రీతిలో కేసిఆర్ మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజేందర్ తనకు పార్టీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని నాయకుడుగా ఉన్న ఈటల వ్యక్తిగతంగా తనకు ఉన్న ప్రజా మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఈటలను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే దళిత ఓట్ బ్యాంకును పూర్తిగా హ్యాండ్స్ లోకి తెచ్చుకునేందుకు వ్వూహాత్మకంగా దళిత బంధు పథకాన్ని కేసిఆర్ అనౌన్స్ చేయడంతో పాటు హూజూరాబాద్ నియోజకవర్గం నుండే ఈ పథకాన్ని ప్రారంభించారు.

గెల్లు శ్రీనివాస్ ఎంపికకు కారణం ఇదే..
ఇటీవల సాగర్ ఉప ఎన్నికలో సీనియర్, జూనియర్ నేత మధ్య జరిగిన పోటీ టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన జూనియర్ నేత నోముల భగత్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిపై విజయం సాధించారు నోముల భరత్ జానారెడ్డికి ఏ రకంగా చూసుకున్నా సమ ఉజ్జీ కాకపోయినా కేసిఆర్ పొలిటికల్ స్ట్రాటజీ తో భగత్ గెలిచారు ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తదితర నేతలు నియోజకవర్గ బాధ్యతలను కేసిఆర్ అప్పగించారు. ఇదే ఫార్ములాతో హూజూరాబాద్ ఉప ఎన్నికల విషయంతో సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పూహాత్మకంగా ఈటెలకు సమ ఉజ్జీ కాకపోయినా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది.

కారణం ఏమిటంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో కులాల పరంగా చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ. అందులో ముదిరాజు, చేనేత, యాదవ సామాజిక వర్గీయులు వరుస క్రమంలో అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో రెడ్డి సామాజిక వర్గ ఓటింగ్ ఉంది. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో బీసీ ఓటింగ్ లో చీలిక తీసుకువచ్చేందుకు ఉద్యమ నేపథ్యంలో ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన యువజన నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దింపారని అంటున్నారు. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఏ మాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బీసీ ఓటింగ్ లో చీలిక
ముదిరాజ్ సామాజిక వర్గీయులు పూర్తిగా ఈటలకు మద్దతు తెలియజేస్తున్న క్రమంలో బీసీ సామాజికవర్గంలోని యాదవ్, చేనేత ఓటింగ్ కూడా కీలకం కావడంతో చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా వారి మద్దతు కూడగట్టే పనిలో టీఆర్ఎస్ ఉంది. అదే మాదిరిగా కాంగ్రెస్ పారీ నుండి టిఆర్ఎల్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడంతో పాటు బీజేపీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. దళిత బంధు పథకం ద్వారా ఆ సామాజికవర్గం టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దళిత సామాజిక వర్గంలో మంచి క్రేజ్ ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల బీఎస్పీలో చేరడంతో రాష్ట్రంలో బీఎస్పీ కూడా ఇప్పుడు యాక్టివ్ అవుతోంది.

ఈటల వర్సెస్ టీఆర్ఎస్‌ నువ్వా నేనా
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి పాలైనా సాగర్ ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ విజయం సాధించడంతో ఆదే ఊపును కొనసాగిస్తూ ఈటలను గట్టి దెబ్బతీయాలని చూస్తున్నది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వివిధ రకాల సర్వేలు ఈటలకు అనుకూలంగా ఉందని చెబుతున్నా అధికార టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్న కారణంగా కీన్ కాంటెస్ట్‌‌యే అన్న మాట కూడా వినబడుతోంది. ‌


Share

Related posts

స్టార్ హీరో రేంజ్ లో సాయి పల్లవి.. ఎవరినీ లెక్కచేయడం లేదా.. ?

GRK

స్థానిక ఎన్నికల కోసం టీడీపీ ఎదురుచూపులు!ఇవీ చంద్రబాబు లెక్కలు!!

Yandamuri

Ys Jagan: మూడో స్థానం నుండి ఆరో స్థానంలో కి పడిపోయిన జగన్ ర్యాంక్..!!

sekhar