హైదరాబాద్ లో టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద జాయిస్ కమల (36) అనే యువతి హాల్ చల్ చేసింది. జూబ్లిహిల్స్ రోడ్ నెం 35లో పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు వచ్చిన ఆ యువతి తాను పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ సెక్యురిటీ సిబ్బందికి చెప్పింది. అయితే అందుకు వారు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన దుస్తులను తీసేస్తూ రాళ్లతో సెక్యురిటీ సిబ్బందిపై దాడికి దిగింది. దీంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు పోలీసులు చేరుకుని ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల విచారణలో ఆమె తమిళనాడు మధురై ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఆమెకు మతి స్థిమితం లేదనీ, గతంలోనూ హీరో సాయి తేజ్ ఇంటి వద్ద కూడా ఇలానే హంగామా సృష్టించినట్లు తెలిసింది. అప్పట్లో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు.
లెక్కలు చెప్పి మరీ కేంద్రంలోని బీజేపీని దూర్పారబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్