NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఒకటి కాకపోతే మరొకటి వచ్చే .. బండి సంజయ్ కుమారుడిపై కళాశాల యాజమాన్యం వేటు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కుమారుడు బండి భగీరధ్ చర్యలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్శిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ జూనియర్ విద్యార్ధిని బండ బూతులు తిడుతూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర సంచలనం అయ్యింది. ఇందులో బాధితుడు ఫిర్యాదు చేయనప్పటికీ కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో బండి భగీరథ్ పై ఐపీసీ 341, 323, 504, 34 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మరో పక్క కళాశాల యాజమాన్యం కూడా భగీరథ్ పై చర్యలు తీసుకుంది.యూనివర్శిటీ నుండి భగీరథ్ ను సస్పెండ్ చేసింది.

Bandi Sanjay Son Viral Video

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. తొలుత వైరల్ అయిన వీడియోలోని బాధితుడు .. ఇది గతంలో జరిగిందనీ, తాను తప్పు చేస్తేనే కొట్టడం జరిగిందనీ, ఒక విద్యార్ధినికి తాను మెసేజ్ పెడితే భగీరథ్ కొట్టారనీ, ఆ తర్వాత తాము కాంప్రిమైజ్ అయ్యామనీ, ఇప్పుడు తాము స్నేహితులుగా ఉన్నామని వీడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదం సమసిపోతుందని భావిస్తున్న తరుణంలో భగీరథ్ సహా మరి కొందరు జూనియర్ ను ర్యాగింగ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తొంది.

Bandi Sanjay Son Viral Video

 

రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్శిటీ యజమాన్యం భరీరథ్ ను సస్పెండ్ చేసింది. అయితే ఈ వీడియోలు వైరల్ చేయడంపై బీజేపీ శ్రేణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే కొందరు కుట్ర చేస్తున్నారని, తన కుమారుడిని అడ్డు పెట్టుకుని డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దమ్ముంటే తనతో నేరుగా రాజకీయాలు చేయాలి కానీ తన కుమారుడి వీడియోలు వైరల్ చేసి నీచ రాజకీయాలు చేయడం సరికాదని బండి సంజయ్ అంటున్నారు. తన కుమారుడు తప్పు చేసి ఉంటే తానే స్వయంగా పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తానని బండి సంజయ్ చెబుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే(నా)..!

sharma somaraju