NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: బీజేపీ రెండో జాబితా విడుదల .. ఆశావహుల్లో నిట్టూర్పు..ఎందుకంటే..?

Telangana Assembly Polls:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఒకే సారి వంద మంది పైగా అభ్యర్ధులతో మొదటి లిస్ట్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్ధులతో మొదటి జాబితా విడుదల చేయగా, రెండో జాబితాపై కసరత్తు పూర్తి చేసింది. ఈ సాయంత్రానికి రెండో జాబితా విడుదల చేయనున్నది. బీజేపీ ఈ నెల 22వ తేదీన 52 మందితో అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. రెండు జాబితాపై ఆ పార్టీ అధిష్టానం తర్జన భర్జనలు పడుతోంది.

రెండో జాబితా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆ పార్టీలోని ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పొత్తులో భాగంగా 20కిపైగా స్థానాలు జనసేన అడుగుతున్న నేపథ్యంలో బీజేపీ రెండో జాబితా ఆలస్యం అవుతోందని సమాచారం. అయితే ఇవేళ బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితా విడుదల చేసింది. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో కేవలం ఒకే ఒక్క అభ్యర్ధి పేరు ఉండటంతో ఇతర నియోజకవర్గాల్లోని ఆశావహులు నిరుత్సాహం చెందారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపి మిథున్ కుమార్ రెడ్డికి కేటాయిస్తూ బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. త్వరలో పూర్తి స్థాయి జాబితా విడుదలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తొంది.

తొలి జాబితాలో హుజూరాబ్, గజ్వేల్ నుండి ఈటెల రాజందర్ పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే కరీంనగర్ నుండి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో దిగుతున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుండి పోటీకి బీజేపీ సిద్దమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం కల్పించిన బీజేపీ.. ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపింది. మొదటి జాబితాలో బీసీలకు పెద్ద పీట వేసింది. బీసీలు 16, ఎస్సీలు 8, ఎస్టీలు 6, ఓసీలు పది మందికి స్థానాలు కేటాయించింది.

మొదటి జాబితా

 • సిర్పూర్ – డా.పాల్వ హరీష్ బాబు
 • బెల్లంపల్లి (ఎస్సీ) – శ్రీమతి అమరాజుల శ్రీదేవి
 • ఖానాపూర్(ఎస్టీ) – రమేష్ రాథోడ్
 • ఆదిలాబాద్ – పాయల్ శంకర్
 • బోధ్(ఎస్టీ) – సోయం బాబు రావు (ఎంపీ)
 • నిర్మల్ – ఆలేటి మహేశ్వర్ రెడ్డి
 • ముదోల్ – రామారావు పటేల్
 • ఆర్మూర్ – పైడి రాకేష్ రెడ్డి
 • జుక్కల్ (ఎస్సీ) – టీ. అరుణ తార
 • కామారెడ్డి – కే. వెంకట రమణారెడ్డి
 • నిజామాబాద్ అర్బన్ – ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
 • బాల్కొండ – అన్నపూర్ణమ్మ ఆలేటి
 • కోరుట్ల – ధర్మపురి అరవింద్ (ఎంపీ)
 • జగిత్యాల – డా బోగా శ్రావణి
 • ధర్మపురి (ఎస్సీ) – ఎస్ కుమార్
 • రామగుండం – కందుల సంధ్యారాణి
 • కరీంగనర్ – బండి సంజయ్ (ఎంపీ)
 • చొప్పదండి (ఎస్సీ) – బొడిగే శోభ
 • సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
 • మానకొండూర్ (ఎస్సీ) – ఆరేపల్లి మోహన్
 • హుజురాబాద్ – ఈటెల రాజేందర్
 • నార్సాపూర్ – ఎర్రగొళ్ల మురళీ యాదవ్
 • పఠాన్‌చెరు – టీ.నందీశ్వర్ గౌడ్
 • దుబ్బాక – రఘనందన్ రావు
 • గజ్వేల్ – ఈటెల రాజేందర్
 • కుత్భుల్లాపూర్ – కునా శ్రీశైలం గౌడ్
 • ఇబ్రహింపట్నం – నోముల దయానంద్ గౌడ్
 • మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
 • ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
 • కార్వాన్ – అమర్ సింగ్
 • గోషామహల్ – టీ రాజాసింగ్
 • చార్మినార్ – మేఘా రాణి
 • చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
 • యాకత్పురా – వీరేంద్ర యాదవ్
 • బహ్దుర్‌పురా – వై. నరేష్ కుమార్
 • కల్వకుర్తి – తల్లోజు ఆచార్య
 • కొల్లాపూర్ – అల్లెని సుధాకర్ రావు
 • నాగార్జున సాగర్ – కంకణాల నవనీత రెడ్డి
 • సూర్యపేట – సంకినేని వెంకటేశ్వర్ రావు
 • బోనగిరి – గూడూరు నారాయణ రెడ్డి
 • తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య
 • జనగామ – డా.దశ్మంత్ రెడ్డి
 • స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) – డా.గుండె విజయ రామారావు
 • పాలకుర్తి – లేగా రామ్మోహన్ రెడ్డి
 • డోర్నకల్ (ఎస్టీ) – భుక్యా సంగీత
 • మహబుబాబాద్(ఎస్టీ) – జాతోత్ హుసేన్ నాయక్
 • వరంగల్ పశ్చిమ – రావు పద్మ
 • వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
 • వర్ధన్నపేట (ఎస్సీ) – కొండేటి శ్రీధర్
 • భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి
 • ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్
 • భద్రాచలం (ఎస్టీ) – కుంజా ధర్మారావు.

రెండో జాబితా

 • మహబూబ్ నగర్ – ఏపి మిథున్ కుమార్ రెడ్డి

Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా .. ‘నాట్ బిఫోర్’ మీ అంటూ తప్పుకున్న న్యాయమూర్తి

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!