25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..?

Share

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్దం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల మూలంగా అధికార బీఅర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. వాస్తవానికి తెలంగాణలో అసెంబ్లీలో ప్రస్తుత బీజేపీ బలం మూడు అసెంబ్లీ స్థానాలే. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు రెండు పర్యాయాలు కేసిఆర్ పాలన చూశారు కాబట్టి ఇక ప్రజలు బీజేపీకి అవకాశం కల్పిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ పార్టీలో ఊపు తీసుకువచ్చినా ఆశించినంత మేర చేరికలు ఇంత వరకూ జరగలేదు. రాబోయే ఎన్నికల్లో ఏలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని తెలంగాణ కమలనాధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Bandi Sanjay Chandra Babu

 

73 ఏళ్ల చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది ఆ రెండు స్కీమ్ లేనంటూ సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా

మరో పక్క టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందడంతో తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి సై అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఆ క్రమంలోనే ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడంతో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈ ఎత్తుగడలు వేస్తున్నారంటూ ఒ పక్క బీఆర్ఎస్, మరో పక్క వైసీపీ నేతలు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికతో అది బీఆర్ఎస్ కే ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అలా జరగకుండా ఉండేందుకు టీడీపీతో పొత్తునకు బీజేపీ అంగీకరించే అవకాశం ఉంటుందని తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారుట. అందుకే తెలంగాణలో బీజేపీకి ఉన్న బలాన్ని చూపించేందుకు త్వరలో నిజామాబాద్, వరంగల్లులోనూ బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేస్తొంది. ఏపిలో టీడీపీతో పొత్తు ఉండదనీ, జనసేనతోనే తమ ప్రయాణం అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ ఎంపి జీవీఎల్ నర్శింహరావులు పదేపదే చెబుతూ వస్తున్నారు.

అయితే ఏపి కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు వస్తున్నందున ఇక్కడ పొత్తు పొడిస్తే దాన్ని ఏపిలోనూ ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారుట. కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. దీంతో కొందరు బీజేపీ నేతల్లోనూ దీనిపై సందేహాలు తలెత్తాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందన్న విషయాన్ని విజయశాంతి గుర్తు చేస్తూ టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండగా చెప్పాలని బండి సంజయ్ ను ప్రశ్నించారుట. ఇదే అనుమానం చాలా మందిలో ఉన్నందున క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ కూడా అనడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొత్తు విషయంపై క్లారిటీ ఇచ్చేశారుట. టీడీపీతో పొత్తు ఉండదనీ ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య పొత్తుల అంశం ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు చర్చకు వస్తుంటాయి, కానీ ఒక తెలంగాణలో, మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి నుండి పొత్తుల అంశంపై రకరకాల ఊహగానాలు తెరపైకి వస్తున్నాయి. వాటిపై నేతలు మాట్లాడుతున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పటి వరకు అయితే చంద్రబాబు ఆశలపై బండి సంజయ్ నీళ్లు చల్లినట్లేనని భావిస్తున్నారు.

అంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్లు జైలు శిక్ష


Share

Related posts

RGV: ఏపీ గవర్నమెంట్ ని ప్రశ్నించిన RGV, దీనికి చిరు రియాక్షన్ కేక!!

Ram

దెయ్యం పేరుతో బాలికలపై మాంత్రికుడు అత్యాచారం.. చివరికి?

Teja

కమెడియన్ వేణు, ఆయన కొడుకు రేవంత్ రచ్చ మామూలుగా లేదండోయ్?

Varun G