తెలంగాణలో 2023 – 24 బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.2,11,685 కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయాన్ని రూ.37,525 కోట్లుగా పొందుపర్చారు.

రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు
- సొంత పన్నుల ఆదాయం రూ.1,31,028 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
- 2023-24 లో బహిరంగ రుణాలు రూ.40,615 కోట్లు
- 2023 -24లో రుణాలు రూ.46,317 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
- గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు
- 2023 – 24 అంచనాల ప్రకారం రాష్ట్ర నికర అప్పులు రూ.3,57,059 కోట్లు
- జీఎస్డీపీలో అప్పుల శాతం 23.8
- అమ్మకం పన్నుల ఆదాయం రూ.39,500 కోట్లు
- స్టాంపులు – రిజిస్ట్రేషన్ ల శాఖ ఆదాయం రూ.18,500 కోట్లు
- ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం రూ.19,884 కోట్లు
- అమ్మకం పన్ను ద్వారా ఆదాయం రూ.39,500 కోట్లు
- వాహనాల పన్ను ద్వారా ఆదాయం రూయ7,512 కోట్లు
కేటాయింపులు
- వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
- విద్యుత్ శాఖ కు రూ.12,727 కోట్లు
- ప్రజా పంపిణీ వ్యవస్థ కు రూ.3,117 కోట్లు
- ఆసరా ఫింఛన్ల కోసం రూ.12,000 కోట్లు
- దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
- ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
- ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం రూ.2,131 కోట్లు
- అటవీ శాఖ కోసం రూ.1,471 కోట్లు
- మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు
- విద్య కోసం రూ.19,093 కోట్లు
- వైద్యం కోసం రూ.12,161 కోట్లు
- హోంశాఖ కోసం రూ.9,599 కోట్లు
- కొత్తగా నియమించే ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.1,000 కోట్లు
- పరిశ్రమల శాఖ కోసం రూ.4,037 కోట్లు
- రోడ్లు భవనాల మరమ్మత్తుల కోసం రూ.2,500 కోట్లు
- ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.10,348 కోట్లు
- పరిపాలనా శాఖ కోసం రూ.11,372 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.31,426 కోట్లు
- ఆయిల్ పామ్ సాగు కోసం రూ.వెయ్యి కోట్లు
- పాతబస్తీ మెట్రో కోసం రూ.500 కోట్లు
- వడ్డీలేని రుణాల కోసం రూ.1500 కోట్లు
- రుణ మాఫీ కోసం రూ.6,385 కోట్లు
- రెండు పడకల గదుల ఇళ్ల కోసం రూ.12వేల కోట్లు
- విశ్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కి రూ.500 కోట్లు
- విమానాశ్రయ మెట్రో రూ.500 కోట్లు
- కాళేశ్వరం టూరిజం సర్క్యట్ రూ.750 కోట్లు
- యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు
- మూసీ రివర్ ఫండ్ కు రూ.200 కోట్లు
- మహిళా విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్