NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానికే .. ఏకవాక్య తీర్మానం ఆమోదించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ) ముగిసింది. గచ్చిబౌలి లోని ఎల్లా హోటల్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏఐసీసీ పరిశీలకులతో కలిసి కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామని చెప్పారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారని, ఆ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు ఆ తీర్మానంలో పేర్కొన్నట్లు తెలిపారు.

సుమారు గంట పాటు జరిగిన ఈ సీఎల్పీ భేటీలో సీఎల్పీ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, తీర్మానాన్ని భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులు బలపరిచారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్ తో పాటు దీప్ దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్ హజరైయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, దామోదర రాజనర్శింహ తదితర సీనియర్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఏఐసీసీ ప్రతినిధులతో మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయి వారి అభిప్రాయాలను వక్తం చేసినట్లు తెలుస్తొంది.

మరో పక్క రాజ్ భవన్ లో ఈ సాయంత్రానికి సీఎం, డిప్యూటి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి నియామకంపైనే మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం ఉన్నట్లుగా చెబుతున్నారు. డిప్యూటి సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, సీతక్క, షబ్బీర్ ఆలీ పేర్లు వినబడుతున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన ఆర్భాటంగా నిర్వహించాలని భావిస్తున్నారు.

సీఎం, డిప్యూటీ సీఎం లు ఎవరు అనేది ఇప్పుడు తేలుపోతుండగా, మంత్రులుగా ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్న దానిపైనా చర్చ జరుగుతోంది. వివేక్ వెంకట స్వామి, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బోజ్జు, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కూనంనేని సాంబశివరావు (సీపీఐ), ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా పద్మావతి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, రామో మోహన్ రెడ్డి, దామోదర రాజనర్శింహ లకు కేబినెట్ లో చోటు లభించవచ్చనే చర్చ జరుగుతోంది.

BRS MLA: రెండు రికార్డులు సొంతం చేసుకున్న కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri