తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. వసంత విహార్ లో నిర్మించిన కొత్త భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసిఆర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవేళ ఉదయం హైదరాబాద్ నుండి ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసిఆర్..నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత మంచి మూహూర్తాలు లేకపోవడంతో పనులు పూర్తి కాకపోయినా వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఇవేళ పార్టీ కార్యాలయ భవనాన్ని కేసిఆర్ ప్రారంభించారు.

అంతకు ముందు పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు కేసిఆర్. అనంతరం నేతలతో కలిసి కార్యాలయంలో పూజలు నిర్వహించారు. తనకు కేటాయించిన ఛాంబర్ లో కేసిఆర్ ఆశీనులయ్యారు. తదుపరి బీఆర్ఎస్ ముఖ్యనేతలతో ఆయన సమావేశమైయ్యారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు. 2021 సెప్టెంబర్ లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. అత్యంత వేగంగా నిర్మాణ పనులు జరిగాయి.

నాలుగు అంతస్తులుగా నిర్మించిన ఈ భవనంలో లోయర్ గ్రౌండ్ లో మీడియా హాలు, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. గ్రౌండ్ ప్లోర్ లో క్యాంటిన్, రిసెప్షన్ లాబీ, నాలుగు ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఇక మొదటి అంతస్తులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడి ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. రెండు, మూడు అంతస్తుల్లో మొత్తం 20 రూమిలు నిర్మించారు. వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పగా మిలిగిన 18 ఇతర రూములు పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయి.
బీజేపీలోకి పొంగులేటి, జూపూల్లి ..? మూహూర్తం ఫిక్స్ అయినట్లే(నా)..!
లోకేష్ నోట ‘జె’ ట్యాక్స్ మాట!