20.7 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మౌనం వీడి ఘాటుగా స్పందించిన సీఎం కేసిఆర్ .. ఎమన్నారంటే ..?

Share

KCR: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇప్పటి వరకూ వ్యూహాాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ నోరు మెదిపారు. నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో తెలంగాణ పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలునకు బేరసారాలు జరిపిన నలుగురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ నేతలకు సూచించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ కేటిఆర్ .. పోలీసు దర్యాప్తులో ఉన్నందున తాను ఆ విషయాలపై మాట్లాడననీ, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

CM KCR

 

అయితే ఇవేళ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రణభేరి సభలో సీఎం కేసిఆర్ …ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సదరు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, వర్షవర్థన్ రెడ్డిలను వేదికపై తీసుకువచ్చిన కేసిఆర్ ..మాట్లాడుతూ కొంత మంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారనీ, కానీ వందల కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా తమ ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కొనియాడారు. వడ్లు కొనడం చేతకాదు కానీ, వందల కోట్లు సంచుల్లో వెసుకుని ఎమ్మెల్యేలను అంగట్లో పశువులను కొన్నట్లు కొనడానికి వచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొని తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూశారని కేసిఆర్ ఆరోపించారు.

తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని తమ నలుగురు ఎమ్మెల్యేలు ఎడమ కాలిచెప్పుతో కొట్టినట్లు వారికి బుద్ది చెప్పారని అన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చి చంచల్ గూడ జైలులో ఉన్నారని కేసిఆర్ ఎద్దేవా చేశారు. ఇంత అరాచకం జరుగుుతుంటే మౌనంగా ఉందామా అని కేసిఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్ల రూపాయలు వారికి ఎక్కడి నుండి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు కేసిఆర్. దీని వెనుక ఉన్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని అన్నారు. రాజ్యాంగ బద్దమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాననీ, కేసు కోర్టులో ఉంది కాబట్టి తాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని రాబోయే రోజుల్లో అన్ని బయటకు వస్తాయని అన్నారు కేసిఆర్.


Share

Related posts

Amarfall: ఈ పండుతో బరువు తగ్గించుకోండిలా..!

bharani jella

KCR: బీపీ పెరుగుతోంది అంటూ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

sridhar

KCR: కేసీఆర్ షాకింగ్ నిర్ణ‌యాలు… మ‌రో అధికారి బ‌దిలీలో కూడా అదే లెక్క‌

sridhar