29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

 లెక్కలు చెప్పి మరీ మోడీ సర్కార్ పై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసిఆర్

Share

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి మోడీ పై ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీఏ, ఎన్డీఏ పాలనలోని గణాంకాలను వివరిస్తూ మోడీ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామాకైనా సిద్ధమని సవాల్ విసిరారు కేసిఆర్. మోడీ హయాంలో ఏ రంగంలోనైనా వృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధ రేటు 6.8, కానీ మోడీ వచ్చాక మన వృద్ధి రేటు 5.8కి పడిపోయిందన్నారు. యూపీఏ హయాంలో వృద్ధి రేటు 34 శాతం ఎక్కువ అని, కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోడీ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.1 గా ఉందనీ, మోడీ పాలనలో సగానికి సగం పడిపోయిందని కేసిఆర్ మండిపడ్డారు.

KCR

 

ప్రధాని మోడీ కి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారనీ, మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియాగా మారిందని కేసిఆర్ అన్నారు. తాను చెప్పిన లెక్కలు అన్నీ వాస్తవాలనీ, ఒక్క అబద్దం ఉన్నా రాజీనామా చేస్తానని కేసిఆర్ సవాల్ విసిరారు. తన మాటకు కట్టుబడి ఉంటాననీ, అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోడీకి లేదని అన్నారు.  ఆదానీ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే .. మోడీ ప్రసంగంలో ఆదానీ ప్రస్తావనే తీసుకురాలేదని కేసిఆర్ మండిపడ్డారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఆదానీ అంశంపై ఢిల్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని అన్నారు. 60, 40 ఏళ్లి క్రిందటి నెహ్రూ, ఇందిర పాలనను విమర్శిస్తున్న మోడీ.. ఆదానీ విషయం చెప్పకుండా సంబంధం లేని విషయాలు పార్లమెంట్ లో ప్రసంగించారని కేసిఆర్ దుయ్యబట్టారు. త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని బీజేపీ, కాంగ్రెస్ నిందించుకుంటున్నాయని కేసిఆర్ అన్నారు.

దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోడీయేనని కేసిఆర్ విమర్శించారు. మోడీకి సలహాలు ఇచ్చే వాళ్లు సరిగ్గా లేరనీ, ఎదైనా తప్పుజరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలని కేసిఆర్ అన్నారు. గోద్రా అల్లర్లకు సంబంధించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీని బ్యాన్ చేశారనీ, ఏకంగా బీబీసీనే బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీ అంటే జీ న్యూసా, ఈడీ దాడులు చేయగానే బంగ్ చేయడానికి, బీబీసీ.. నీ బోడి ఈడీ, బోడీ లకి భయపడుతుందా అని కేసిఆర్ ప్రశ్నించారు. ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుందని కేసిఆర్ ప్రశ్నించారు. 2024 ఎన్నికల తర్వాత అంతా కుప్పే మిగులుతుందని, గతంలో ఇందిరను వాజ్ పేయి దుర్గామాతగా పొడిగారని గుర్తు చేస్తూ ఇందిర జీవితాన్ని ఓ కోర్టు తీర్పు మలుపు తిప్పిందనీ, ఇందిరను కూడా ప్రజలు ఇంటికి పంపారని కేసిఆర్ గుర్తు చేశారు.  ఎల్ఐసీని అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నష్టం వస్తే సమాజం నెత్తిన.. లాభం వస్తే ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాలకు అప్పగించారని కేసిఆర్ ఆరోపించారు.

మహాసేన రాజేష్ ఈ నెల 16న టీడీపీలో చేరిక.. జనసేన పార్టీ శ్రేణులకు నాగబాబు కీలక సూచన.. ఏమిటంటే..?


Share

Related posts

సుప్రీం కోర్టు దగ్గర షాక్ తిన్న జగన్ కు కేంద్రం ఊరట…!

siddhu

కార్వీ ఎండీ పార్ధసారధికి మరో సారి షాక్ ఇచ్చిన ఈడీ.. రూ.110 కోట్ల ఆస్తులు జప్తు

somaraju sharma

Toll Fees: వాహనదారులకు గుడ్ న్యూస్ ..! ఇలా ఉంటే టోల్ రుసుము కట్టాల్సిన పని లేదంట..!!

somaraju sharma