NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR – CM Revanth: కేసీఅర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..ఎందుకంటే..?

KCR – CM Revanth: నిన్న మున్నటి వరకూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఎన్నికలు పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కేసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండిపోవాల్సి వచ్చింది. రెండు టర్మ్ లు ముఖ్యమంత్రిగా చేసిన కేసిఆర్ .. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

అయితే రెండు రోజుల క్రితం కేసిఆర్ ఇంటి బాత్ రూమ్ లో ప్రమాదవశాత్తు జారి పడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజీగూడ యశోదా ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి .. కేసిఆర్ అరోగ్యంపై ఆరా తీశారు. కేసిఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.

ఇవేళ స్వయంగా రేవంత్ రెడ్డి యసోదా ఆసుపత్రికి వెళ్లి కేసిఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి కేటిఆర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసిఆర్ ను పరామర్శించాననీ, ఆయన క్రమంగా కోలుకుంటున్నారనీ చెప్పారు. మాజీ సీఎం  కేసిఆర్ వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నానన్నారు. కేసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలనీ, తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో కేసిఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గానీ ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గానీ పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నా అది వ్యక్తిగత వైరంగా ఉండేది కాదు. అసెంబ్లీ లాబీల్లో గానీ బయట ఎక్కడైనా వేదికల్లో కలిసిన సందర్భాల్లో పలకరించుకునే వాళ్లు. అప్యాయంగా మాట్లాడుకునే వారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగతంగా మాట్లాడుకునే వాళ్లు. గత అసెంబ్లీలోనూ కేసిఆర్ .. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జానా రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులను గౌరవంగానే సంభోధించే వారు.

అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు నేపథ్యంలో కేసిఆర్ తో ఆయన వైరం వ్యక్తిగతంగా మారింది. ఆ తర్వాతనే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి కేసిఆర్ సర్కార్ పై పోరాటం చేశారు. తన వాక్ చాతుర్యంతో కేసిఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతూ వచ్చి రేవంత్  కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రాజీలేని పోరాటం చేసి ముఖ్యమంత్రిగా ఎదిగారు.

కేసిఆర్ పై తీవ్ర స్థాయి వ్యతిరేకంతో నిన్న మొన్నటి వరకూ వ్యవహరించిన రేవంత్ రెడ్డి ..ఇవేళ కేసిఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వెళ్లి పరామర్శించడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. గత సంప్రదాయన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రికి గౌరవించి తన పరపతిని రేవంత్ మరింత పెంచుకున్నాడని అంటున్నారు. కేసిఆర్ ను రేవంత్ పరామర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  .

Komatireddy Venkat Reddy: తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన .. కావాలని కక్ష సాధింపు చర్యలు ఉండవు  కానీ ..

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju