Telangana Congress: జానారెడ్డి బాటలో ఈ నేత కూడా..!!

Share

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారు అవుతోందన్న మాట వినబడుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు అధికార టీఆర్ఎస్, మరి కొందరు బీజేపీలో సెటిల్ అవ్వగా, ఉన్న కొద్ది మంది సీనియర్ నేతలు టీపీసీసీ రేసులో నేను అంటే నేను అని పోటీ పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి వరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పుడల్లా రేవంత్ వ్యతిరేకులు కొందరు తమ గళం విప్పుతున్నారు. సీనియర్ నేత వీ హనుమంతరావు అయితే తీవ్ర స్థాయిలో అపోజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల మూలంగా బలోపేతం కాలేకపోతుందని మాట వినబడుతోంది.

Telangana Congress: Damodara Rajanarasimaha former deputy chief minister
Telangana Congress: Damodara Rajanarasimaha former deputy chief minister

కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయన్న భావన లేని నేతలు కొందరు సైలెంట్ అవుతున్నాయి. ఇటీవల సాగర్ ఎన్నికల్లో పోటీ చేసిన పరాజయం పాలైన సీనియర్ నేత జానారెడ్డి ఇక క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అదే దారిలో మరో మాజీ మంత్రి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీత సుమారు అయిదు దశాబ్దాల అనుబంధం ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీల సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గం అయిన ఆంథోల్ లోనూ పెద్దగా పర్యటించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయన మనస్థాపానికి కారణం అయ్యాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. దామోదర రాజనర్శింహ మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రెండు సార్లు మంత్రిగా పని చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Read More: Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గ్యాస్ లీకేజీ..ఒకరి మృతి

దళిత నేతగా పేరొందిన ఆయన అంథోల్ నియోజకవర్గం నుండి రెండు సార్లు పరాజయం పాలైయ్యారు. ఒక నాడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన రాజనర్శింహ ప్రస్తుతం పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తన పేరు వినబడకపోవడంతో రాజనర్శింహ లో అసంతృప్తి మరింత ఎక్కువ అయ్యిందని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో రాజనర్శింహ సతీమణి బీజేపీలో చేరడం, తిరిగి రావడం తనను ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. రాజనర్శింహ ఇటీవల తన సన్నిహితుల వద్ద అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పడమే మేలని అనుకుంటున్నారుట. తను కూడా జానారెడ్డి బాటలో రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజనర్శింహ వ్యవహారం మరి కొద్ది రోజుల్లో తేలనున్నది.

 

 


Share

Related posts

ప్రతి ఇంటిలో ఉండవలిసిన మెడికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోండి!!

Kumar

కేసీఆర్‌కు జ‌గ‌న్ స్పెష‌ల్ దావ‌త్‌… ఎందుకో తెలుసా?

sridhar

Budget : బడ్జెట్ 2021 : ఆరు ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు

somaraju sharma