TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవేళ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించి ఫలితాల వివరాలను మంత్రి వెల్లడించారు. పరీక్ష రాసిన వారిలో ఇంజనీరింగ్ లో 80 శాతం, అగ్రికల్చర్ లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే రెండు కేటగిరిల్లో ఏపికి చెందిన విద్యార్ధులే టాప్ ఫైవ్ ర్యాంకులు సాధించడం విశేషం. ఇంజనీరింగ్ పరీక్షలో 79 శాతం బాలురు. 85 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి చెప్పారు. అనిరుథ్ అనే విద్యార్ధి మొదటి ర్యాంక్ సాధించినట్లు ప్రకటించారు.

అగ్రికల్చర్ పరీక్షల్లో 84 శాతం బాలురు, 87 శాతం బాలికలు క్వాలిఫై అయ్యారని తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కేటగిరిలో టాప్ ఫైవ్ ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ టాపర్ గా నిలిచాడు. ఇంజనీరింగ్ విభాగంలో విశాఖకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్ గా నిలిచాడు. మే 10,11 వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుండి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ పరీక్షలకు 1,06,514 మంది విద్యార్ధులు హజరైయ్యారు. జూన్ లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.in లో చెక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్య ప్రభుత్వ కార్యదర్శి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి పాల్గొన్నారు.
*ఇంజనీరింగ్ లో మొదటి అయిదు ర్యాంక్ లు సాధించిన వారు.. శనపాల అనిరుధ్, యకంటిపల్లి మునీందర్ రెడ్డి, చల్లా ఉమేష్ వరుణ్, అభినిత్ మంజేటి, ప్రమోద్ కుమార్
*అగ్రికల్చర్, మెడిసిన్ లో మొదటి అయిదు ర్యాంక్ లు సాధించిన వారు .. బూరుగుపల్లి సత్య, ఎన్ వెంకట తేజ, సఫల్ లక్ష్మి, కార్తికేయ రెడ్డి, బి వరుణ్ చక్రవర్తి
YS Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ