25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం, హైకోర్టుల్లో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ

Share

తెలంగాణ సర్కార్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ కోర్టు ఉత్తర్వులను ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్ పై విచారణకు హైకోర్టు సీజే నిరాకరించారు. సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరగా, ధర్మాసనం విచారణ తర్వాత సింగిల్ జడ్జి విచారణ జరపరాదని హైకోర్టు సీజే స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీం కోర్టు మాత్రమే సమీక్షిస్తుందని హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.

TRS MLAs poaching case

 

ఇప్పటికే అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి చేరనున్నది. కేసు దర్యాప్తునకు ఉన్న అడ్డంకులు హైకోర్టు తీర్పుతో తొలగిపోయాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలనీ, సిట్ దర్యాప్తు యథావిధిగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వం వేసిన అప్పీల్ ను సీజే ధర్మాసనం ఇప్పటికే కొట్టివేసింది. ఈ పిటిషన్ కు అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో నేర తీవ్రత ను సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని దీనిపే నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తెలిపింది.

మరో పక్క హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడానికి, త్వరితగతిన విచారణకు ధర్మాసనం నిరాకరించింది. సీజేఐ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా మెన్షన్ చేశారు. అయితే ఈ పిటిషన్ పై స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాడానికి ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ కేసు 13వ తేదీన విచారించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి  విజ్ఞప్తి చేశారు. త్వరతగతిన విచారించడానికి నిరాకరిస్తూ .. 17వ తేదీన విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. త్వరితగతిన విచారణ జరపాలని పదేపదే ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా.. అంతతొందరెందుకు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ చేతికి సాక్షాలు వెళ్తే చేసేది ఏమీ లేదనీ, కేసు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. 17వ తేదీ విచారణ చేపడతామనీ, మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?


Share

Related posts

షర్మిల పార్టీ పప్పులు తెలంగాణలో ఉడకవు – డీకే అరుణ ఫైర్

somaraju sharma

Survey : పెట్రోల్ ధరల పెంపు తర్వాత సామాన్యుడి జీవితం ఎలా తయారయిందో చెప్పిన సర్వే…!

siddhu

సరికొత్త స్ట్రాటజీ తో చంద్రబాబు తో కేసీఆర్..??

sekhar