Telangana Government : ఈ -గోల్కొండ పోర్టల్ ను లాంచ్ చేసిన కేటీఆర్..!!

Share

Telangana Government : తెలంగాణ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ -గోల్కొండ E- Golkonda ఫ్లాట్ ఫామ్ పోర్టల్ ను ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.. చేనేత, జౌళి శాఖ లో ఓ విభాగమైన హ్యాండీక్రాఫ్ట్స్ అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి ఈ- మార్కెట్ ప్లేస్ ని తయారు చేయడమే లక్ష్యంగా పోర్టల్ ను రూపొందించినట్లు చెప్పారు..

Telangana Government : E- Golkonda portal launches now
Telangana Government : E- Golkonda portal launches now

ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు ఈ విధంగా మాట్లాడారు.. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ -గోల్కొండ ద్వారా అద్భుతమైన సంప్రద కళాకృతులు చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు.ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేటు ఈ కామర్స్ వెబ్సైట్ల కంటే అత్యుత్తమంగా web-portal సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ వెబ్ సైట్ లో ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులు చేర్చేందుకు వీలుందన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడికైనా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ -గోల్కొండ ద్వారా అమ్మకానికి ఉంచిన ప్రతి కళాకృతులని సునిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 3డీ టెక్నాలజీ ని సైతం అందులో ఉంచామని చెప్పారు. ఈ వెబ్సైట్ను మొబైల్ ఫోన్లకు సరిపడే ఈ విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. వెబ్ సైట్ ద్వారా రాష్ట్రంలో తయారవుతున్న హ్యాండీక్రాఫ్ట్, ఇతర అద్భుతమైన కళాకృతులకు మార్కెటింగ్, అవసరమైన ప్రచారాన్ని కల్పించే వీళ్ళు కలుగుతుందని వివరించారు.
https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయవచ్చని కేటీఆర్ తెలిపారు.


Share

Related posts

YS Jagan : నిమ్మగడ్డ మీద ఈగ కూడా వాలకుండా ప్రాణంగా చూసుకుంటోన్న జగన్ ? ఇదో వెరైటీ కహానీ.

somaraju sharma

టాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు వదులుకొని శృతిహాసన్ వెళ్ళిపోతుందా … కారణం చాలా పెద్దదే ..!

GRK

Tirupati By Poll: హైకోర్టుకు చేరిన తిరుపతి పార్లమెంట్ బై పోల్ పంచాయతీ..

somaraju sharma