NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Governor Tamilisai: ప్రధాని మోడీని కలిసి తెలంగాణ గవర్నర్ తమిళి సై.. మీడియా ముందు కీలక వ్యాఖ్యలు..

Telangana Governor Tamilisai: తెలంగాణ సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళి సై సౌందర్యారాజన్ మధ్య జరుగుతున్న వివాదం ఢిల్లీకి చేరింది. గత కొద్ది రోజులుగా కేసిఆర్, తమిళిసై మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ఆ తరువాత ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయి. ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం కేసిఆర్ సహా మంత్రులు హాజరుకాలేదు. జరుగుతున్న పరిణామాలపై ఉగాది వేడుకల సందర్భంలో తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిణామాలపై మాట్లాడేందుకు నిన్న ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ తమిళి సై నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. పలు విషయాలను మోడీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో కలిసిన తరువాత తమిళి సై మీడియాతో మాట్లాడారు.

Telangana Governor Tamilisai meets PM Modi
Telangana Governor Tamilisai meets PM Modi

Telangana Governor Tamilisai: ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి ప్రధాన మంత్రిని కలవలేదు

తెలంగాణలో ఏమి జరుగుతుందో అందరికీ తెలుసునన్న తమిళి సై..తాను వివాదాస్పద వ్యక్తిని కాదనీ, ఫ్రెండ్లీ గవర్నర్‌నని పేర్కొన్నారు. తాను రాజ్యాంగ బద్దంగానే నడుచుకుంటాననీ, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి ప్రధాన మంత్రిని కలవలేదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సమర్ధవంతంగా జరిగినందుకు మోడికి కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. పుదుచ్ఛేరి – హైదరాబాద్ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధాని మోడీని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్షత చూపుతోందనీ, మహిళా గవర్నర్ ను అవమానిస్తున్నారనీ , గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్ కు ఉందన్నారు. వ్యక్తిగా కాకుండా వ్యవస్థను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని అన్నారు.

గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదని చెప్పారు. సేవా రంగం తరపున కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఆ వ్యక్తి ఎలాంటి సేవ కార్యక్రమాలు చేయలేదని భావించానన్నారు. అందుకే ఆ ఫైల్ ను పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు. కొన్ని  కారణాలను సాగుగా చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదని అన్నారు. తాను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయటపెట్టాలన్నారు. సీఎం ఏ విషయంపై అయినా తనతో నేరుగా వచ్చి చర్చించవచ్చని పేర్కొన్నారు. తాను ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికే ప్రయత్నించాననీ అధికారాన్ని చలాయించడం లేదని అన్నారు. ఏ చర్యలు తనను నిలువరించలేవని స్పష్టం చేశారు. కాగా తమిళిసై తరువాత హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా కలవనున్నట్లు సమాచారం. త్వరలో రాజ్ భవన్ లో ఏర్పాటు చేయనున్న ప్రజాదర్భార్ పై, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కూడా అమిత్ షాకు తమిళిసై వివరించనున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju