తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మరో సారి కేసిఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

Share

తెలంగాణ సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై మద్య మనస్పర్ధలు, విబేధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు రాజ్ భవన్ పట్ల సీఎం కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తమిళి సై విమర్శించారు. తాజాగా మరో సారి ఈ రోజు మీడియా సమావేశంలో కేసిఆర్ సర్కార్ పై చురకలు వేశారు. సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసిఆర్ అన్ని అవకాశాలను వదులుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం వివిక్షత చూపుతోందంటూ పదేపదే మాట్లాడుతున్న కేసిఆర్ దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్లలేదు, సమస్యలను ఎందుకు ప్రస్తావించేదని ప్రశ్నించారు తమిళి సై. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. ఇది అనేక సందర్భాల్లో బయటపడిందన్నారు.

Telangana Governor Tamilisai Sensational Comments on CM KCR
Telangana Governor Tamilisai Sensational Comments on CM KCR

 

సమక్క సారలక్క జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని హెలికాఫ్టర్ అడిగితే కూడా ఇవ్వలేదన్నారు. చివరి క్షణం వరకూ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదనీ, అయినా తాను నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి గిరిజన ప్రజల ఆరాద్య దైవం సమక్క, సారలమ్మ జాతరకు వెళ్లానని చెప్పారు గవర్నర్ తమిళి సై. ప్రభుత్వం తనను చాలా సార్లు ఇబ్బంది పెట్టిందని అయనా తాను భయపడదేది లేదని స్పష్టం చేశార. ఇంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. మహిళా గవర్నర్ గా తనను చాలా తక్కువగా అంచనా వేశారనీ, ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని తమిళిసై పేర్కొన్నారు. రాజ్ భవన్ న అంటరానిదిగా చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పంపుతున్న సమస్యల పట్ల కూడా ప్రభత్వం స్పందించడం లేదని అన్నారు. బారస ట్రిపుల్ ఐటిలో సమస్యలు చూసి తాను చలించిపోయానన్నారు.

Read More: కృష్ణానదికి మళ్లీ భారీగా వరద .. ప్రాజెక్టుల వరద ప్రవాహం ఇలా

ఈ మూడేళ్లలో రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారిందని తమిళిసై అన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలన్నది తమ అభిలాష అని చెప్పిన తమిళి సై.. ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానని తెలిపారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని చెప్పారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని తెలిపారు. రాష్ట్రంలో పేదల కోసం పని చేస్తునే ఉంటానని స్పష్టం చేశారు. సమస్య ఏమైనా ఉంటే తనతో సీఎం మాట్లాడవచ్చని అన్నారు. ఎట్ హౌమ్ కు వస్తానని సీఎం రాకపోవడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రెపబ్లిక్ డే నాడు  జెండా ఎగురవేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న అంశంపైనా గవర్నర్ తమిళి సై మాట్లాడారు. పెద్ద ఆసుపత్రి డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని గవర్నర్ తమిళి సై అన్నారు.

Read More: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవికి హోరాహోరీ పోరు .. ‘చాడ’కు చెల్లు..!!


Share

Related posts

బిగ్ బాస్ 4: మాస్టర్ ఎలిమినేట్ అవటంతో అందరి టార్గెట్ ఆమె..??

sekhar

జగన్ సమక్షం లో : వైకాపా టాప్ మినిస్టర్ అవినీతి మొత్తం బయటకి ??

somaraju sharma

సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధి బృందం…ఎందుకంటే..?

somaraju sharma