NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ప్రగతి భవన్ – రాజ్ భవన్ వార్ లో కీలక ట్విస్ట్ .. సీఎస్ ‌పై గవర్నర్ తమిళిసై ఫైర్

రీసెంట్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించడం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా (ప్రభుత్వ పాఠం చదవడం) ప్రసంగించడంతో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మద్య గతం నుండి నెలకొన్న విభేదాలు సమసిపోతున్నట్లేనని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే  ప్రగతి భవన్ – రాజ్ భవన్ మళ్లీ వివాదం ముదురుతున్నట్లే కనబడుతోంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. బడ్జెట్ సమావేశాల సమయంలో కోర్టుకు వెళ్లి వెనక్కు తగ్గిన తెలంగాణ సర్కార్ .. ఈ సారి ఏకంగా సుప్రీం కోర్టు గడప తొక్కింది.  బిల్లులు గవర్నర్ ఆమోదించడం లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడంపై సుప్రీం కోర్టులో రిటి పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరింది రాష్ట్ర ప్రభుత్వం.

tamilisai soundararajan santi kumari

పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవీ

  • తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
  • ములుగు అటవీ కళాశాలను యూనివర్శిటీగా మార్చే బిల్లు
  • ప్రైవేటు యూనివర్శిటీస్ బిల్లు
  • మోటర్ వాహనాల పన్ను బిల్లు
  • వ్యవసాయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లు
  • మున్సిపల్ చట్ట సవరణ
  • పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు

తనపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళి సై ట్వట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి తీరుపై అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు గవర్నర్ తమిళి సై. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర ఉందని అన్నారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్ భవన్ కు రాలేదని పేర్కొన్నారు. కనీస మర్యాదగా ఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించేందుకు సీఎస్ దగ్గర సమయం లేదా అని ప్రశ్నించారు. మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గర అని సీఎస్ శాంతి కుమారి గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్ భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం కనీస మర్యాద, గౌరవం ఇవ్వడం లేదన్నట్లుగా మరో సారి గవర్నర్ తమిళి సై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఎంత వరకూ దారి తీస్తాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. సుప్రీం కోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. తొలి రోజు కార్యక్రమాలు ఇలా..

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?