NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదా..? ఆ రెండు పథకాలు కట్..! తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!!

Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా (corona) సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో నామమాత్రంగా కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాల్లో వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహామ్మారి ప్రపంచం వ్యాప్తంగా అన్ని దేశాలను చుట్టేసింది. గత ఏడాది కరోనా మొదటి దశలో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో కొద్ది నెలలకు తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది మొదట్లో మళ్లీ కరోనా సెకండ్ వేర్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ వేవ్ లో గ్రామీణ ప్రాంతాలకు కరోనా మహామ్మారి విస్తరించింది.

telangana govt key desicion on Corona Vaccine
telangana govt key desicion on Corona Vaccine

Corona Vaccine: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్

ఈ ఏడాది సెకండ్ వేవ్ లో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ తరుణంలోనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో ప్రజానీకంగా కొంత ఊరట చెందారు. తొలుత వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ సిబ్బంది, పోలీస్ ఇతర ఉద్యోగులకు ఆ తరువాత 60 సంవత్సరాల పైబడినవారికి, తదుపరి 40 ఏళ్లు, తరువాత 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతూనే ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు పలువురు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప్రజలకు ఉన్న అనుమానాలపై వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొంత మంది వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

వ్యాక్సినే తీసుకోకపోతే రేషన్, పింఛన్ కట్

కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే నవంబర్ 1వ తేదీ నుండి వారికి రేషన్, పెన్షన్ పంపిణీ నిలుపుదల చేయాలని నిర్ణయించింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. కరోనా టీకా తీసుకోని వారికి రేషన్, ఫించన్ నిలిపివేస్తామని డిహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకుని మహమ్మారి నుండి అప్రమత్తంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N