TSPSC: తెలంగాణ గ్రూప్ – 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ – 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యుల్ చేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ – 2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో సమావేశంలో గ్రూప్ – 2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

గ్రూప్ – 2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండో సారి. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత విడుదల చేసిన షెడ్యుల్ ప్రకారం .. ఆగస్టు 29,30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ – 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్ధులు, వివిధ రాజకీయ నేతలు ఆందోళనలు చేశారు. వారి నుండి వచ్చిన డిమాండ్ లతో ప్రభుత్వం గ్రూప్ – 2 పరీక్షను వాయిదా వేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న తరుణంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
Nara Lokesh: మరలా రావాలంటూ లోకేష్ కు సీఐడీ నోటీసులు .. తొలి రోజు విచారణపై లోకేష్ ఏమన్నారంటే..?