NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ దర్యాప్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టులో లభించని ఊరట.. విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ విచారణపై మద్యంతర ఉత్తర్వులు (స్టే) ఇవ్వాలని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు. అయితే ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ వల్ల ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.

Rohit Reddy

 

ఎమ్మెల్యేల కొినుగోలు కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదు దారుడనీ, అయినప్పటికీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి వ్యక్తిగతృ, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని ఇవ్వాలని విచారణ పేరుతో వేధిస్తున్నారని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ విచారణను నిలుపుదల చేయాలని కోరారు. పార్టీ మారితే వంద కోట్లు ఆఫర్ చేశారు గానీ డబ్బులు ఇవ్వనప్పుడు మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని న్యాయవాది ప్రశ్నించారు. ఈ కేసులో మనీలాండరింగ్ విచారణ చట్ట విరుద్దమని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం, ఈడీలకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.

Telangana High Court

అయితే రోహిత్ రెడ్డికి ఇప్పటికే ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. కోర్టు కేసును 5వ తేదీకి వాయిదా వేయడంతో కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకూ రోహిత్ రెడ్డి విచారణకు హజరు కావాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈడీ రెండు రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారణ జరిపింది. మరో పక్క ఈ కేసులో రెండవ నిందితుడుగా ఉన్న నందకుమార్ ను కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారణ జరిపిన ఈడీ అధికారులు.. నందకుమార్ నుండి సేకరించిన వ్యాంగ్మూలాన్ని సీల్డ్ కవర్ లో నాంపల్లి కోర్టుకు అందజేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju