NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana High Court Jobs: నిరుద్యోగులకు అలర్ట్ .. టీ ఎస్ హెచ్ సీ నుండి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు .. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇవి..

Telangana High Court Jobs: తెలంగాణ హైకోర్టు (టీఎస్ హెచ్ సీ) నుండి ఇటీవల భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిపికేషన్లు విడుదల అయ్యాయి. జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల మొదటి వారంలో ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన హైకోర్టు .. ఈ నెల 11న మరో 9 నోటిఫికేష్లు విడుదల చేసింది. ఈ 15 నోటిఫికేషన్లకు సంబంధించి అర్హతలు, పోస్టుల వివరాలు, ధరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే వివరాలు ఈ కింది విధంగా..

Telangana high court job notifications Details

 

1.ఆఫీసు సబార్టినేట్ పోస్టులు 50, ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే వారు 7వ తరగతి నుండి పదవ తరగతి మధ్య ఉత్తీర్ణులై ఉండాలి. పదవ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పదవ తరగతి తర్వాత హైయర్ స్టరీ చేసి ఉండకూడదు. 2. అసిస్టెంట్ పోస్టులు 10. వీటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఎదైనా డిగ్రీ (ఆర్స్, సైన్స్, కామర్స్, లా) ఉత్తీర్ణులే ఉండాలి. 3. ఎగ్జామినర్ పోస్టుల 17. వీటికి కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. 4.సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు 45. ఈ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బీటెక్ (ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిప్లొమా లో ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ , ఐటీ చేసిన వాళ్లు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. 5.అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 2. ఈ పోస్టులకు లా డిగ్రీతో పాటు బీఎల్ ఐఎస్సీ డిగ్రీ ఉండాలి. ఎంఎల్ ఐఎస్సీ ఉన్నవారికి ప్రాధాన్యం. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి.

7.కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 20. ఈ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎదైనా డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా) పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషులో నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. ఏడాది పీజీ డిప్లొమా – కంప్యూటర్ ప్రొగ్రామింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు చేసి ఉండాలి లేదా బీసీఏ డిగ్రీ కలిగి ఉండాలి. 8. ట్రాన్స్ లేటర్ పోస్టులు 10. వీటిలో తెలుగు ట్రాన్స్ లేటర్ పోస్టులు 8, ఉర్దూ ట్రాన్స్ లేటర్ పోస్టులు రెండు. ఈ పోస్టునకు మూడేళ్ల లేదా అయిదేళ్లు లా డిగ్రీ ఉండాలి. తెలుగు ట్రాన్స్ లేటర్ పోస్టులకు తెలుగు నుండి ఇంగ్లీషు, ఇంగ్లీషు నుండి తెలుగు లోకి ట్రాన్స్ లేషన్ చేయగలగాలి. అదే విధంగా ఉర్దూ ట్రాన్స్ లెటర్ పోస్టులకు ఉర్దూ నుండి ఇంగ్లీషు, ఇంగ్లీషు నుండి ఉర్దూలోకి ట్రాన్స్ లేషన్ చేయగలగాలి. 9. కోర్టు మాస్టర్స్ , హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి పోస్టులు 20. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా) ఉత్తీర్ణులై ఉండాలి. దానితో పాటు ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ టెక్నికల్ పరీక్ష (హైయర్ గ్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి. 10. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 275. ఈ పోస్టులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొంది. 11.ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు వివిధ జిల్లాల్లో 77 పోస్టులు. వీటికి కూడా విద్యార్హత డిగ్రీ. డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్ధి ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. 12. ఎగ్జామినర్ పోస్టులు మొత్తం 66. ఈ పోస్టులకు ఇంటర్ పూర్తి అయిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. 13. రికార్డు అసిస్టెంట్ పోస్టులు 97. ఈ పోస్టులకు ఇంటర్ పూర్తి అయిన ప్రతి ఒక్కరూ ధరఖాస్తు చేసుకోవచ్చు. 14. ప్రాసెస్ సర్వర్ పోస్టులు మొత్తం 163. ఈ పోస్టులకు పదవ తరగతి పూర్తి చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. 15. అఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తం 1226. ఈ పోస్టులను తెలంగాణలోని వివిధ జిల్లాల వారిగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు గానూ ఏడవ తరగతి నుండి 10వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. పదవ తరగతి కంటే పై తరగతులు చదివిన వారు ధరఖాస్తు చేసేందుకు అనర్హులు.

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆరు నోటిఫికేషన్ల కు ధరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ నెల 11వతేదీ నుండి ప్రారంభం అయింది. ఈ నెల 31వ తేదీ వరకూ ధరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబందించి పరీక్షలకు కంప్యూటర్ విధానంలో మార్చి నెలలో నిర్వహిస్తారు. ధరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ https://cdn3.tcsion.com/EForms/configuredHtml/2775/79559/Registration.html క్లిక్ చేయండి.

9 నోటిపికేషన్లకు సంబంధించి 176 ఖాళీల భర్తీకి హైకోర్టు ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 21 వ తేదీ నుండి ప్రారంభం కానున్నది. ఆయా పోస్టులకు అర్హత ఉన్న వారు వచ్చే నెల (ఫిబ్రవరి) 11వ తేదీ వరకూ ధరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షలకు సంబందించి హాల్ టికెట్ లు ఫిబ్రవరి 20వ నుండి అందుబాటులో ఉంచుతారు. మార్చి నెలలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల తేదీని తర్వాత ప్రకటిస్తారు.

ఇక ఫీజుల విషయానికి వస్తే జనరల్, బీసీ అభ్యర్ధులు రూ.600 (అదనంగా మరో రూ.23), ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.400 (అదనంగా మరో రూ.23)లు ఫీజుగా చెల్లించాలి. పై ఉద్యోగాలకు వయో పరిమితి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు అయిదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు https://tshc.gov.in/getNotifications వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

Road Accident: పండుగ వేళ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన రోడ్డు ప్రమాదం

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N