Telangana High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్ లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముడుపులు అందాయంటూ ఓ వర్గం టీవీ ఛానల్స్ లో జరిగిన డిబేట్ గురించి ప్రస్తావిస్తూ .. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జస్టిస్ లక్ష్మణ్ గారి ఆవేదన పూర్తి ఫాఠం తెలుగులో
“కేసు పూర్వాపరాలోకి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పదలచాను. కొన్ని మీడియా సంస్థలు నన్ను ఈ కేసులో జడ్జిమెంట్ వారికి కావలసినట్టు / కొరుకొన్నట్టు వచ్చేలా నా మీద విపరీతం గా వత్తిడి తీసుకొని రావడానికి ప్రయత్నించారు. ఆ ప్లాన్ లో భాగంగా నా వ్యక్తిత్వాన్ని మలిన పరిచేందుకు చెయ్యగలిగిన వన్ని కొన్ని మీడియా సంస్థల్లో డిబేట్ లో కూర్చుని కామెంట్స్ చేశారు. దీని వల్ల నేను ఒత్తిడి కి లోనయ్యి నిపక్షపతం గా తీర్పు ఇవ్వకుండా ఉండాలని వారు కోరుకున్నారు అనుకుంటా. ఈ మీడియా సంస్థల వారు కొందరిని సెలెక్ట్ (వారి వారి పూర్వ అనుభవాలు తెలుసుకొనే) చేసుకొని కావాలనే నా మీద వ్యక్తి గతమైన ఆరోపణలు చేయించారు అనుకుంటున్నా. నాకు ప్రెస్స్ అన్నా ఫోర్త్ ఎస్టేట్ అన్నా విపరీతమైన గౌరవం ఉంది. మీడియా అనేది మన ప్రజాసామ్యం ఒక గొప్ప పాత్రను పోషించాలి అని అందరి లాగా నేను కూడా కోరుకుంటున్నా. కోర్ట్ ల జడ్జిమెంట్ ల పై ప్రెస్స్ తమ తమ అభిప్రాయాల ను వెళ్ళబుచ్చే స్వేచ వారికి ఉంది. అది మన ప్రజసామ్యం లో అత్యంత అవసరం. కానీ రోజు రోజుకీ మీడియా అనేది వెర్రి తలలు వేస్తూ కోర్ట్ నిర్ణయాలను కూడా ప్రభావితం చెయ్యడానికి పూనుకుంటుంది.
ఆ డిబేట్ లో ఒకానొక సస్పెండ్ అయిన జడ్జి గారు నేను డబ్బుల మూటలు తీసుకొన్నాను అని ఆరోపణలు చేసారు. ఇంకో భాధ్యత గల పోస్ట్ లో ఉన్న వారు నన్ను “చేయ్యండ్రా” అనే మాటతో వెకిలిగా ప్రవర్తించారు. వారి వెకిలి చేస్థలు నాకున్న అధికారాలకు వక్ర భాష్యాలు ఆపాదించడం తో పాటు నేను ఇచ్చే తీర్పు లకు మలినం అంటిచే విధం గా ఉండడం శోచనీయం. వారి చేష్టలు మనదేశ న్యాయవ్యవస్థ కు ఉన్న గౌరవం అదమ స్థాయికి చేర్చెలా ఉన్నాయి. కానీ ఈ సమయంలో అలాటి నీచమైన ప్రయత్నాలకు గండి కొట్టాల్సిన అవసరం నా మీద ఉందని గ్రహించాను. కొన్ని మీడియా సంస్థలు తరచూ న్యాయ స్థానాలను పని గట్టుకొని లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయి అనడం లో సందేహం లేదనిపిస్తోంది. ఇలాంటి ఉద్దేశ్యపూర్వక చేష్టలు తప్పక కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి. కానీ నాకు నేను గా ఇందులో ఓ నిర్ణయం తీసుకోదలచుకోలేదు. ఆ నిర్ణయాన్ని ఈ కోర్ట్ పెద్ద అయిన చీఫ్ జస్టీస్ వారికి గౌరవం గా నివేదించడం మంచిది అనిపిస్తోంది. చీప్ జస్టీస్ వారి యాక్షన్ మన న్యాయ్యవస్థ నిష్పక్షపాతంగా , స్వతంత్రంగా పని చెయ్యడానికి తోడ్పడుతుంది అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నా. ఈ కోర్ట్ రిజిస్ట్రార్ గారిని ఆ రోజు రాత్రి డిబేట్ జరిగిన ఏ బి ఎన్ /మహా టివి ఛానల్ ఫుటేజ్ లను డౌన్లోడ్ చేసి నా ఈ ఆర్డర్ తో శ్రీమాన్ చీఫ్ జస్టిస్ వారి సముఖమునకు నివేదించాలని కోరుతున్నా. వారి నిర్ణయ్యాన్ని మన మందరం గౌరవిద్దాం” అని జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Big Breaking: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు