NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు కొత్త ఓటర్ల జాబితాపై హైకోర్టు ఏమన్నందంటే..?

Munugode Bypoll:  తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా ఉన్నాయి. మరో వైపు మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. కొత్త ఓటర్ల నమోదుపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరుపుతోంది. నిన్న విచారణ సందర్భంలో ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశించగా.. నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ జాబితాను హైకోర్టుకు సమర్పించారు. మునుగోడులో 2018 అక్టోబర్ 12న ఓటర్లు 2,14,847 ఉన్నారనీ, ఈ నెల 11 నాటికి కొత్తగా వచ్చిన ఓట్లు మొత్తం కలిపి ఇప్పటి వరకు 2,38,759 ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.

munugode bypoll

 

కొత్తగా 25,013 ఓటర్లు ధరఖాస్తు చేసుకున్నారని వివరించిన సీఇఓ .. వీటిలో 12,249 కొత్త ఓటర్లకు అనుమతించి, 7,247 తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 5,517 ఫారం 6 లు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తి అవుతుందని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఓటర్ల ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పెండింగ్ లో ఉన్న ఓటరు జాబితా నిలిపివేయాలని ఆదేశించింది.మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని సవరించిన ఓటరు జాబితా సమర్పించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. వాటిపై సందేహాలు ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

మరో పక్క మునుగోడు ఉప ఎన్నిక నిలుపుదలకు హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Munugode bypoll: మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం .. ఎంత మంది నామినేషన్లు దాఖలు చేశారంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju