Telangana High Court: పాఠశాలల ప్రత్యక్ష తరగతులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..!!

Share

Telangana High Court:  తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభం తరగతుల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష విద్యాబోధనపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులకు కశ్చితంగా హజరుకావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దనీ, తరగతులకు హజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అదే విధంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని చెప్పింది.

Telangana High Court-key-orders-on-schools-reopen-issue
Telangana High Court-key-orders-on-schools-reopen-issue

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలను పునః ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ  ఇటీవల హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ కు చెందిన ఎం బాలకృష్ణ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఎలాంటి శాస్త్రీయ అధారం లేకుండా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందనీ, కోవిడ్ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్, ప్రత్యక్ష బోధనలపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు.. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యాశాఖకు ఆదేశించింది.

ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన హైకోర్టు..రాష్ట్రంలో ఇంకా కోవిడ్ తీవ్రత కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు, మరో వైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని పేర్కొన్న హైకోర్టు తదుపరి విచారణన అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

 


Share

Related posts

రథయాత్ర కోసం సుప్రీం కు బీజేపీ

Siva Prasad

Daily Horoscope జూలై 16 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

వైసిపి ఎల్‌పి నేతగా జగన్ ఎన్నిక

somaraju sharma