పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సూత్రధారి బండి సంజయ్ అంటూ కరీంనగర్, కమలాపుర్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. సంజయ్ కుద్రదారుగా పేర్కొన్న పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆయనను ఏ 1 గా చేర్చగా హనుమకొండ కోర్టు నిన్న ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిమాండ్ రద్దు చేయాలని బండి సంజయ్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి అత్యవసర విచారణ జరపాలని వారు కోరగా, ఇవేళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అంగీకరించారు. అయితే ఈ పిటిషన్ ను విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. సంజయ్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరో వైపు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని సంజయ్ కు ధర్మాసనం తెలిపింది.

మరో పక్క హనుమకొండ కోర్టులో నిన్న సంజయ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవేళ విచారణ జరిగింది. సంజయ్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు బెయిల్ అపోజ్ చేస్తూ వాదనలు వినిపించారు. సంజయ్ ను కస్టడీ విచారణ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై న్యాయమూర్తి విచారణను సోమవారంకు వాయిదా వేశారు. బెయిల్ పై తుది తీర్పు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో బండి సంజయ్ బెయిల్ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ జైలులో ఉన్నారు.
గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్ధులకు కరోనా.. భయాందోళనల్లో తల్లిదండ్రులు