Telangana Leaders Padayatra: తెలంగాణలో పాదయాత్రకు సిద్దమైన మరో నేత..! ఎందుకంటే..?

Share

Telangana Leaders Padayatra: ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉంది. రాష్ట్రంలో రెండవ సారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసిఆర్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని బలహీనపర్చారు. దీనికి తోడు ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు తదితర కారణాల వల్ల దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు కైవశం చేసుకున్న జోష్ తో బీజేపీ ..రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కు పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ ప్రభుత్వంపై, కేసిఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 45 పైగా డివిజన్ లను బీజేపీ గెలుచుకుంది. ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ ఉత్సహాంతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో పక్క సీనియర్ నేతలను కాదనీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీసీసీ పగ్గాలను పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డికి అప్పగించింది. దీంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా పాత కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. దళిత దండోరా సభలను నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపారు. దీంతో పార్టీ లో చేరికలు షురూ అయ్యాయి. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ఇరు పార్టీలు రాబోయే ఎన్నికలు లక్ష్యంగా టీఆర్ఎస్ పై పోరు చేస్తున్నారు.

 

 

Telangana Leaders Padayatra:  రాజన్న రాజ్యం అంటూ

మరో పక్క తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీని పెట్టి జనాల్లోకి వచ్చారు. కేసిఆర్ సర్కార్ విధానాలను విమర్శిస్తూ ముందుగా నిరుద్యోగ సమస్యపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మంగళవారం దీక్ష లు నిర్వహిస్తున్నారు. గతంలో మదిరిగానే కేసిఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడతారనో లేక ఇప్పటి నుండి యాక్టివ్ కాకపోతే 2023 ఎన్నికల్లో సత్తా చాటలేమేమో భావిస్తున్నారో గానీ నేతలు పాదయాత్రలకు సిద్ధమైయ్యారు. దీంతో రాజకీయ నాయకుల పాదయాత్ర సీజన్ ప్రారంభం అయ్యింది.

 

నేతల చైతన్య యాత్రలు

తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకుని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు మరో నేత పాదయాత్రకు సన్నద్దం అవుతున్నారు. ఆయన ఎవరు అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధు యాష్కీ అత్యంత సన్నిహితుడు. తాను పాదయాత్ర చేస్తున్నట్లు మధు యాష్కీ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుండి 21 వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,300 కిలో మీటర్లు ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు మధు యాష్కీ పేర్కొన్నారు.

 

 


Share

Related posts

ఉచిత శిక్షణ, ఉద్యోగం అందించనున్న ఇన్ఫోసిస్..

bharani jella

Bigg Boss 5 Telugu: ఆరు వారాలకు శ్వేతకి బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ లెక్కలు..??

sekhar

Election commission: మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఎన్నికల సంఘం ఏమి చేసిందంటే..!?

somaraju sharma