KTR: తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకుని ముందుకు సాగుతుండగా, జాతీయ పార్టీ బీఆర్ఎస్ తో కేంద్రంలో చక్రం తిప్పాలని సీఎం కేసిఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తరచు కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుండగా, బీఆర్ఎస్ శ్రేణులు కేంద్రంలోని బీజేపి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటిఆర్ .. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు కీలక సవాల్ విసిరారు.

నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటిఆర్.. బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. మాటల్లో సబ్ కా సాథ్ అంటున్న కేంద్రం.. చేతల్లో మాత్రం సబ్ కుచ్ బక్వాస్ అని విమర్శించారు. ఎనిమిదేళ్లు అయినా రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని, ఒక్క విద్యాసంస్థ కొత్తగా ఇవ్వలేదని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదనీ, చిత్తశుద్ది ఉంటే తెలంగామకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని డిమాండ్ చేశారు కేసిఆర్.
పసుపుబోర్డు ఇస్తామన్న కేంద్రం .. ఉన్న జూట్ బోర్డును ఎత్తివేసిందన్నారు. దేశం మొత్తానికి ఉచిత విద్యుత్ ఇస్తే ఏటా లక్ష 45వేల కోట్లు ఖర్చు అవుతుందని ససేమిరా అన్న మోడీ.. బడాబాబులకు మాత్రం రూ.12లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఇకపై చూస్తు ఊరుకునేది లేదని కేటిఆర్ హెచ్చరించారు. కేంద్రానికి దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలనీ, తాము ముందస్తు ఎన్నికలకు వస్తామంటూ సవాల్ విసిరారు కేటిఆర్.
Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే ..? హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నారాయణ హృదయాలయ