NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

లెక్కలు చెప్పి మరీ కేంద్రంలోని బీజేపీని దూర్పారబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Telangana Minister KTR Slams PM Modi

తెలంగాణ మంత్రి కేటిఆర్ మరో సారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ సభలో ఆయన లెక్కలు వివరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నుండి కేంద్రానికి రూ.3,68 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.1,68 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. రెండు లక్షల కోట్లు ఇంకా తెలంగాణకే బాకీ ఉన్నారని చెప్పారు. కానీ సిగ్గులేని కేంద్ర మంత్రి, ఇక్కడ ఉండే నలుగురు సన్నాసి ఎంపీలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో అవగాహన లేదు. కనీసం ఇంగితం లేదు, కేసిఆర్ పై పనికి మాలిన వాగుడు వాగుతుంటారని కేటిఆర్ మండిపడ్డారు.

Telangana Minister KTR Slams PM Modi
Telangana Minister KTR

 

తెల్లవారి లేస్తే పనికి మాలిన బూతులు మాట్లాడటం, మతం పేరుతో రాజకీయం చేయడం తప్ప వాళ్లకు మరో పని లేదని అన్నారు కేటిఆర్. తెలంగాణ చెల్లించిన లక్ష కోట్ల రూపాయల పన్నులు బీజేపీ పాలిత వెనుకబడిన రాష్ట్రాల్లో వాడుతున్నది నిజం కాదా అనేది ఇక్కడ ఉండే బీజేపీ నేతలు, కేంద్రంలోని పెద్దలు చెప్పాలన్నారు. తాను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనాామా చేస్తానని సవాల్ విసిరారు. తాను చెప్పింది తప్పు అని నిరూపించలేకపోతే కిషన్ రెడ్డి రాజీనామా చేయడం అటుంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పగలరా.. ఆ సంస్కారం ఉందా అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. తన సవాల్ తో కిషన్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తారని తాను అనుకోవడం లేదనీ, ఆ పని ఆయనకు చేతకాదని అన్నారు కేటిఆర్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని అసమర్దుడు, దద్దమ్మ కిషన్ రెడ్డి అని విమర్శించారు.

కేసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ ఇంకో బీజేపీ సన్నాసి మాట్లాడుతున్నారనీ, మోడీ కంటే ముందు ఉన్న 14 మంది ప్రధానులు అందరూ కలిసి రూ.56లక్షల కోట్లు అప్పు చేస్తే మోడీ ఒక్కడే ఈ ఎనిమిదేళ్లలో వంద లక్షల కోట్లు అప్పులు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో పుట్టే ప్రతి పిల్లవాడి తలపై లక్షా 25వేల రుణం మోపుతున్నరని విమర్శించారు. కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిక్సూచిలా ఉండే పథకాలను అమలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పు వివిధ ప్రాజెక్టు ల ద్వారా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి సంపదను పునరుత్పత్తి చేస్తుంటే వారి కళ్లు ఎందుకు మండుతున్నాయని ప్రశ్నించారు.

కేసిఆర్ నాయకత్వం లో తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్షా 24వేలు ఉండగా ఇవేళ తెలంగాణ తలసరి ఆదాయం రూ.2లక్షల 78వేలు అని పేర్కొన్నారు. ఇవి తాను చెబుతున్న లెక్కలు కాదనీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న లెక్క అని తెలిపారు. ఇక నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ తలసరి ఆదాయం లక్షా 49వేలు మాత్రమేననీ, ఇది తెలంగాణ తలసరి ఆదాయంలో సగమని అన్నారు. దీన్ని బట్టే ఎవరు సమర్ధులో, ఎవరు అసమర్ధులో అర్ధమవుతుందని కేటిఆర్ పేర్కొన్నారు.

మొన్న గుజరాత్ లో .. నేడు తెలంగాణలో .. డ్రైవింగ్ సీటులోనే గుండెపోటుతో డ్రైవర్ లు మృతి .. అధికారులు దృష్టిసారించాల్సిందే..

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju