NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడులో మందు పార్టీపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. ఇదీ వివరణ.. అవసరమైతే సీబీఐ విచారణ చేయించండి అంటూ సెటైర్

మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఈ తరుణంలో మంత్రి మల్లారెడ్డి కొందరు వ్యక్తులతో మందు పార్టీలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ మందు పార్టీలు ఇస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి మందు బాటిల్ పట్టుకుని గ్లాస్ లో పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మీడియాలో రావడంతో ఆయన స్పందించారు. దీనిపై మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.

Telangana Minister Malla Reddy

“ఎన్నికల ప్రచారంలో ఉన్న తాను బంధువులు పిలిస్తే భోజనానికి వెళ్లా.. మంత్రి అయిన తర్వాత మొదటి సారిగా ఆ గ్రామంలో ఉన్న మా బంధువుల ఇంటికి మొదటి సారిగా వెళ్లా..అక్కడ ఉన్న వాళ్లు అన్న, బావ వరుస అయ్యే వాళ్లు. వాళ్లతో కలిసి భోజనానికి ముందు మందు పార్టీలో కూర్చున్నా.. అది తప్పు అవుతుందా.. రహస్యంగా ఎక్కగా కూర్చోలేదు. పబ్లిక్ ప్లేస్ లో కూర్చోలేదు. మా బంధువుల ఇంట్లో కూర్చున్నాం. అక్కడ ఉన్న అయిదుగురు ఆరుగురు మా బంధువులే.. అది తప్పెలా అవుతుంది. నిన్న ఆదివారం సరదాగా మా వాళ్లతో కంపెనీ ఇచ్చాను, ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియా పెట్టి వైరల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కే కాదు సీబీఐ కి ఫిర్యాదు చేసి ఇదేదో పెద్ద స్కామ్ అని విచారణ చేయించమనండి’ అంటూ మంత్రి మల్లారెడ్డి సైటైర్ వేశారు.

Telangana Minister Malla Reddy

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసింది. వాళ్లకు ఓట్లు వేసే వారే లేరు. బీజేపీకి డిపాజిట్ లు కూడా రావు అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. మునుగోడులో టీాఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పిన ఆయన టీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి ట్రోలింగ్స్ కు పాల్పడుతున్నయంటూ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju