21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఐటీ దాడుల్లో బిగ్ ట్విస్ట్ .. మంత్రి మల్లారెడ్డి Vs ఐటీ .. కేసు, కౌంటర్ కేసులు నమోదు

Share

మంత్రి మల్లారెడ్డి ఆయన సోదరులు, కుమారులు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు 50కిపైగా బృందాలతో ఏకకాలంలో సోదాలు జరిపి భారీ ఎత్తున నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హజరుకావాలంటూ వారికి ఐటీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. మరో పక్క మల్లారెడ్డి తమ విధులకు ఆటంకం కల్గించారంటూ ఐటీ అధికారులు, తమ కుమారుడిపై దౌర్జన్యం చేసి సంతకాలు చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి పరస్పర ఫిర్యాదులతో బోయినపల్లి పోలీసులు కేసు, కౌంటర్ కేసులు నమోదు చేశారు. ఐటీ అధికారి ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 201, 342, 353, 379, 504,506, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి ఫిర్యాదుతో ఐటీ అధికారి రత్నాకర్ పై కేసు నమోదు చేశారు. ఈ రెండు ఎఫ్ఐఆర్ లను బోయినపల్లి పోలీసులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నారు.

Mallareddy

 

మరో పక్క ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బలగాలతో తమ పై పెద్ద ఎత్తున దాడాలు చేశారన్నారు. గతంలో రెండు సార్లు దాడులు జరిగాయనీ, అయితే ఈ విధంగా జరగడం తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్మి…బోర్లు వేసి తాను పైకి వచ్చానని అన్నారు. మెడికల్ కాలేజీలో అంతా ఆన్ లైన్ ద్వారానే సీట్ల భర్తీ చేస్తుండటం వల్ల తన కుమారుడు చదవాలన్నా సీటు ఇప్పించుకోలేని పరిస్థితి తనదని చెప్పారు. దీపావళి రోజున ఇంట్లో పూజ చేశాననీ, అప్పుడు ఇంట్లో రూ.3లక్షలే ఉన్నాయనీ, ఆ డబ్బులే పూజ వద్ద పెట్టానని మల్లారెడ్డి తెలిపారు.

Malla Reddy

 

తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నా అధికారులు కనికరం చూపలేదనీ, మానసికంగా వేధించి సంతకం పెట్టించారనీ, అధికారులే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని అన్నారు. దాడుల్లో ఏమైనా దొరికితే చూపించాలని కదా అని ప్రశ్నించారు. వంద కోట్లు బ్లాక్ మనీ ఉందని సంతకం పెట్టించుకున్నారని, లేని డబ్బు ఎక్కడ చూపించాలని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు ఉండవా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ఈ విధంగా చేస్తుందని సీఎం కేసిఆర్ ముందే చెప్పారని అన్నారు. తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తొందని ఆరోపించారు. సీఎం కేసిఆర్ యే తమకు ధైర్యమని, ఆయనే చూసుకుంటారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ బీజేపీ తమనే కాదు ముఖ్యమంత్రిని కూడా ఏమి చేయలేదని అన్నారు.

YSRCP: కొడాలి, అనిల్ యాదవ్ లకు! బాలినేనికి షాక్ ఇచ్చిన జగన్..! 8 మంది మార్పు వెనుక కారణం..!?


Share

Related posts

KCR: కేసీఆర్ మ‌నిషిని బుక్ చేస్తున్న బీజేపీ

sridhar

Telangana Govt: బిగ్ బ్రేకింగ్…ఏపి కరోనా బాధితులకు తెలంగాణ సర్కార్ షాక్..!!

somaraju sharma

Amit Shah: కాంగ్రెస్ పై అమిత్ షా సెటైర్ .. మరో 30 – 40 ఏళ్లు బీజేపీ హవానే అంటూ ధీమా

somaraju sharma