Telangana : తెలంగాణలో ఇప్పుడు అస‌లు రాజ‌కీయ రంగు….

Share

Telangana : తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయం రంజుగా మారింది. ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వెల్లువలా దాఖలు అయ్యాయి.

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 90కి పైగా అభ్యర్థులు మొత్తం 100 సెట్ల నామినేషన్ల దాఖలు చేయగా ఈ ఒక్క రోజే 52 నామినేషన్లు నమోదయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. 26 తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇక మొత్తం 142 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజు ప్రధాన పార్టీల తో పాటు , స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న ముఖ్యమైన అభ్యర్థులు

1.వాణిదేవి – టిఆర్ఎస్.

2.చిన్నారెడ్డి – కాంగ్రెస్

3.రామచంద్రరావు – బీజేపీ

4.ఎల్. రమణ – టీడీపీ

5. ప్రొ. నాగేశ్వరరావు – వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి.

6. హర్షవర్ధన్ రెడ్డి – కాంగ్రెస్ రెబల్.

7. కపిలవాయి దిలీప్ కుమార్ – టిఆర్ఎల్డి

 

ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి బరిలో ఉన్న ముఖ్యమైన అభ్యర్థులు

1. పల్లా రాజేశ్వర్ రెడ్డి – టిఆర్ఎస్

2. సభావత్ రాములు నాయక్ – కాంగ్రెస్

3. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి – బీజేపీ

4. జయసారధి రెడ్డి – సీపీఐ, సిపిఎం

5. కోదండరామ్ – జనసమితి.

6. రాణి రుద్రమదేవి – యువ తెలంగాణ పార్టీ

7. తీన్మార్ మల్లన్న – ఇండిపెండెంట్

8. చెరుకు సుధాకర్ – తెలంగాణ ఇంటి పార్టీ

 


Share

Related posts

నష్టం మొదలైంది ! తన కంట్లో తానే పొడుచుకున్న రాజుగారు!!

Yandamuri

Suhana Khan : నెటిజన్ల కామెంట్స్ కు బిన్నంగా కౌంటర్ ఇచ్చిన స్టార్ కిడ్..!!

bharani jella

Healthcare: పిల్లలకు ఆ మందులు వాడేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాలిసిన విషయాలు??

Kumar