అమెరికాలో తరచు కాల్పులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దుండగులు జరుపుతున్న కాల్పుల్లో అనేక మంది అమాయకులు బలి అవుతున్నారు. అమెరికాలో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. అమెను తాటికొండ ఐశ్వర్యగా గుర్తించారు. ఈమె రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అని తెలిసింది.

టెక్సాస్ లో ఒక షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. కాల్పుల్లో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా పని చేస్తుందని చెబుతున్నారు. ఐశ్వర్య మృతి తో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. టెక్సాస్ లో జరిగిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు.
మణిపూర్ లో చిక్కుకున్న ఏపి విద్యార్ధుల పరిస్థితి పై మంత్రి బొత్స స్పందన ఇది