NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ కు రిమాండ్

Breaking:  టెన్త్ ప్రశ్నాపత్రాల కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ను పోలీసులు హనుమకొండ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. బండి సంజయ్ ను జైలుకు తరలించే ఏర్పాట్లు అధికారులు చేశారు. కాగా బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఏ ఒ గా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ 2 గా బూర ప్రశాంత్, ఏ 3 గా మహేష్, ఏ 4 గా బాలుడు, ఏ 5 గా మోతం శివ గణ్ష్, ఏ 6 గా పోగు సుభాష్, ఏ 7 గా పోగు శశాంక్, ఏ 8 గా దూలం శ్రీకాంత్, ఏ 9 గా పెరుమాండ్ల శార్మిక్, ఏ 10 గా పోతబోయిన వసంత్ ను పోలీస్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.

Tenth paper leakage case bandi sanjay remanded
Tenth paper leakage case bandi sanjay remanded

 

పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారనీ, అందుకే ముందస్తు చర్యగా అరెస్టు చేసినట్లు వరంగల్లు సీపీ రంగనాధ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారనీ, బీజేపీలో చాలా మందికి పేపర్ షేర్ చేశారని సీపీ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో మాట్లాడారని, పేపర్ లీక్ కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్ స్కూల్ నుండి పేపర్ బయటకు వచ్చిందని చెప్పారు.

పేపర్ లీక్ కేసులో మరి కొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. బండి సంజయ్ అరెస్టు పై లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చామని సీపీ వెల్లడించారు. విచారణలో ఏ 2 ప్రశాంత్ కూడా నేరాన్ని అంగీకరించారని, సంజయ్ ఫోన్ దొరికి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రశాంత్ పేపర్ బయటకు పంపిన వెంటనే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారని, బండి సంజయ్ దురుద్దేశంతోనే ఇలా చేసినట్లు గా నిర్ధారణ అయ్యిందని సీపీ స్పష్టం చేశారు.

BJP: బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత .. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అరెస్టు

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju