NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టెన్త్ పరీక్షా పత్రాల లీక్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటెలకు నోటీసులు

Share

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసు బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కరి చేస్తొంది. ఇప్పటికే ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 14 రోజుల రిమాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడైన ప్రశాంత్ .. వాట్సాప్ ద్వారా ఈటెలకు ప్రశ్నా పత్రం పంపినట్లుగా గుర్తించిన పోలీసులు ఈటెలను విచారించేందుకు సిద్దమైయ్యారు. గురువారం శామీర్ పేటలోని ఈటెల నివాసానికి వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేశారు.

Etela Rajender

 

శుక్రవారం (రేపు) ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం వరంగల్లు డీసీపీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో నోటీసులు రావడంతో ఈటల న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తొంది. పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం, ఎమ్మెల్యే ఈటెలకు నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బదన్నామ్ చేయడానికే బీజేపీ నేతలు ప్రశ్నా పత్రాలు లీక్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

 

హైకోర్టులో బండి సంజయ్ కి లభించని ఊరట .. విచారణ వాయిదా.. బెయిల్ పై కొనసాగుతున్న ఉత్కంఠ


Share

Related posts

కరోనా టాబ్లెట్ వచ్చేసింది కదా అని వేసుకుందాం అనుకుంటున్నారా..ఆగండి ఇది చదవండి

somaraju sharma

బిగ్ బాస్ 4 : దేవి నాగవల్లి కామెంట్స్ కి ఉలిక్కిపడిన బిగ్ బాస్ టీం !

GRK

అచ్చెన్న ఆరంభం మాత్రమే…! ఇంకా ఎవరెవరిపై ఏ కేసులంటే..!!

Srinivas Manem