Eatela Rajendar: ఈట‌ల ఇలాకాలో ఆ మంత్రి దూకుడు మామూలుగా లేదుగా…

Share

Eatela Rajendar: సంచ‌ల‌న రీతిలో త‌న ప‌ద‌విని కోల్పోవ‌డ‌మే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి దూర‌మైన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈట‌ల విష‌యంలో ఆ పార్టీ నేతలు విరుచుకుప‌డుతున్నారు. మంత్రి గంగుల క‌మలాక‌ర్ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టి హుజురాబాద్ లో ప‌నిచే్తున్నారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని జమ్మికుంటలో జ‌రిగిన స‌మావేశంలో తమ్మీ అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటే సీఎం కుర్చీకే ఎసరు పెడతావా అంటూ ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు ఒక శక్తి అన్నారు.

Read More: Eatela Rajendar: రాజీనామాతో రెండు రికార్డులు సృష్టించిన ఈట‌ల‌

కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు…

జమ్మికుంటలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన‌ మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో పథకాలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సర్కార్‌ను విమర్శించడానికి ఈటలకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. ‘నాది సామాన్య వ్యవసాయ కుటుంబం. దేవుడి మీద భారం పెట్టి వ్యవసాయం చేసేవాళ్లం. పెట్టుబడి కోసం సావుకారుల దగ్గరికి వెళ్లి మిత్తీలకు డబ్బులు తీసుకునే పరిస్థితులు ఉండేవి. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక రైతు బంధు పథకం వల్ల ఆ అవ‌స‌రం లేకుండా చేసింది. ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు డబ్బులతో ఐదు ఎకరాలను ఈ రోజు 20 ఎకరాలు చేసుకుంటున్నారు.“ అని అన్నారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల చేయ‌లేనిది… చేసి చూపించిన కేసీఆర్ …

కేసీఆర్ ను దీవించాలంటూ…
టీఆర్ఎస్‌‌ పార్టీని కాపాడుకునే బాధ్య‌త మన అందరిది అని మంత్రి గంగుల అన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఇప్పటికంటే వంద రెట్లు అభివృద్ది చేస్తాం. కాళేశ్వరం, పచ్చటి పొలాలు చూసైనా కేసీఆర్‌‌ను కడుపు నిండా దివించాలి. ఎవ్వరూ వచ్చి ఆపినా పథకాలు ఆగవు’ అని కమలాకర్ పేర్కొన్నారు. ఈటల ఏ పార్టీలో చేరినా తమకు అవసరం లేదని.. ఈ ఎన్నికల వల్ల రాష్ట్రం, దేశంలో ఏమీ మారదన్నారు. కానీ హుజురాబాద్ నియోజక వర్గంలో అభివృద్ధి జరగాలో వద్దనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.


Share

Related posts

ఏపి బీజేపీ నేత కన్నా కోడలు అనుమానాస్పద మృతి

somaraju sharma

సర్కారు వారి మొదటి పాట అద్దిరిపోయింది కానీ…. అదే వెలితి

arun kanna

టిడిపి తోరణాలు,ఫెక్సీలు తొలగిస్తారా?

somaraju sharma