Hyderabad: Actor Pawan Kalyan. (File Photo: IANS)
అయితే , జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారంటున్నారు. జనసేన తరఫున గెలిచినప్పటి నుంచి అప్పుడప్పుడు తప్ప.. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలను కూడా ఆయన పెడచెవిన పెడుతూ వచ్చారు. అదే ఒరవడిలో తాజాగా మరోసారి సంచలన రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేశారు..
ఏపీ సీఎం జగన్ పై జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ సర్కార్ తెచ్చిన పథకాలు, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా సమర్థిస్తూ వస్తున్నారు. ఇదే ఒరవడిలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . నేను వైసీపీ కార్యకర్తను అంటూ ఈ జనసేన ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. సీఎం వైఎస్ జగన్ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే.. మీకు అభ్యంతరం ఏంటి? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాపాక.
జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఇలా విరుచుకుపడుతుంటే …. తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే జనసేన పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు రాపాక వ్యవహారాన్ని లైట్‌గా తీసుకున్న అధిష్టానం.. తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో మరి!
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…