కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులను దొంగలు తస్కరించినట్లు తెలుస్తొంది. ఈ చోరీ ఘటన నేపథ్యంలో ఆలయాన్ని మూసివేశారు. అధికారులు చోరీపై విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేయగా, పోలీసు జాగిలం ఆలయం వెనుక గట్టు దిగువన సీతమ్మ బావి వరకూ వెళ్లి ఆగింది.

కాగా ఇటీవలే కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసిఆర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త నిర్మాణాలు, భక్తుల వసతులపై చర్చించిన సీఎం జగన్ .. అధికారులకు కీలక సూచనలు, అదేశాలు ఇచ్చారు. కొండగట్టు ను ప్రపంచాన్నే ఆకర్షించే అతి పెద్ద హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. అగమ శాస్త్ర ప్రకారం అధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలనీ, అందు కోసం వెయ్యి కోట్లు ఖర్చు అయినా ఫరవాలేదని పేర్కొన్నారు కేసిఆర్. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ఈ తరుణంలో ఆలయంలోని విగ్రహాలు చోరీ కావడంతో పోలీసులు ఈ కేసును సవాల్ తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏపి నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ .. విశేషం ఏమిటంటే..?