KCR: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరైన మోత్కుపల్లి నర్సింహులు పొలిటికల్ కెరీర్ మరో మలుపు తిరిగింది. మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు చెప్పారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. అంతేకాకుండా అంబేడ్కర్ కు నిజమైన వారసుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.
Read More :KCR: తెలంగాణకు ఇంకో ప్రత్యేక రికార్డు సొంతం చేయించిన కేసీఆర్
కేసీఆర్ పై ఎన్ని మాటలు..
దళితులకు పది లక్షలు ఇస్తోన్న ఏకైక మగాడు కేసీఆర్ అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసించారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్రతి ఊరు, ప్రతి వాడలో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు దండోరా వేయాలన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి దరువు వేశారు.రైతు బంధు తో రాష్ట్రంలో ఉన్న రైతులు బాగుపడుతున్నారని, అదే విధంగా దళిత బంధు తో దళితులు బాగుపడుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని దళితులందరూ కేసీఆర్ కు అండగా నిలవాలని అన్నారు.
Read More : KCR: కేసీఆర్ ఇంకో వరం… ఔను హుజురాబాద్ కోసమే!
కేసీఆర్ కండువా కప్పేది అందుకేనా?
హుజురాబాద్ కూడా రాష్ట్రంలోని భాగమే అని , దళిత బంధు ఎక్కడ నుండి ఇస్తే ఏంటని మోత్కుపల్లి ప్రశ్నించారు.ఈటలను బీజేపీలో చేర్చుకోవడం బాధించిందని అన్నారు. “ దళితుల భూములను వాపస్ ఇవ్వాలని మొదట్నుంచి చెబుతున్నాను. ఒక వ్యక్తిని పార్టీలో చేర్చుకునే ముందు ఆ వ్యక్తి క్రెడిబిలిటీ చూడాలి. ఈటల మీద ఎందుకు సానుభూతి చూపాలి? ఆయనను బీజేపీ నెత్తిమీద మోయాల్సిన అవసరం ఏంటి?“ అని ప్రశ్నించారు. ఇలా ఈటల విషయంలో మోత్కుపల్లి దూకుడుగా స్పందించే అవకాశం ఉంది కాబట్టే టీఆర్ఎస్లో చేరేందుకు మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని అంటున్నారు.