Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాక ఆయిన హుజురాబాద్ నియోజకవర్గం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గారిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికలు ఇటు టీఆర్ఎస్ అటు ఈటల రాజేందర్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సమయంలో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ వర్గాల మధ్య విమర్శలు సాగుతున్నాయి. ఇదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More: Eatela Rajendar: ఈటల ఇలాకాపై బీజేపీ ఫోకస్ మామూలుగా లేదుగా
ఇంటెలిజెన్స్ సర్వేలో ఏం తేలిందంటే…
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజరాబాద్ లో కాషాయ జెండా ఎగురడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలంతా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పక్షాన ఉన్నారని, టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థే కరువయ్యాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించిన సర్వేలోనూ 71 శాతం మంది ఓటర్లు బీజేపీ అభ్యర్ధి ఈటల కు మద్దతిస్తున్నట్లు తేలిందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వేలతో బెంబేలెత్తిన కేసీఆర్.. వార్డు మెంబర్ మొదలు ప్రజా ప్రతినిధులందరికీ లక్షలాది రూపాయల ఆశ చూపి టీఆర్ఎస్‌లోకి లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More: Eatela rajendar: ఈటలకు హుజురాబాద్‌లో ఎదురయ్యే అసలు సమస్య ఇదేనా?
బండి సంజయ్ సంచలనం
రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, సామాన్య ప్రజలు బతకలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా తాను చేయబోయే పాదయాత్ర ద్వారా ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. బీజేపీ చేపడుతున్న పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించబోతున్నాయన్నారు. పాదయాత్రలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు సైతం పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు.