కేసీఆర్ కు ఎక్కువ బీపీ పెంచుతున్న బీజేపీ నేత ఎవ‌రంటే…

Share

గ‌త కొద్దికాలంగా తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ హాట్ విమ‌ర్శ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా ప్ర‌త్యేకంగా చెప్పాలంటే… తెలంగాణ‌లో టీఆర్ఎస్, బీజేపీ trs bjp నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే న‌డుస్తోంది.. ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు.. ఒక్క‌టేంటి… పొద్దున లేస్తే.. ఆ రెండు పార్టీల నేత‌లు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

ఈ మ‌ధ్య జ‌రిగిన దుబ్బాక్ బై పోల్, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు పీక్ స్టేజ్‌కి వెళ్లాయి. కేంద్ర మంత్రులు, ఇత‌ర రాష్ట్రాల నేత‌లు వ‌చ్చికూడా టీఆర్ఎస్‌ ను trs, సీఎం కేసీఆర్‌ cm kcr ను, మంత్రి కేటీఆర్‌ను minister ktr టార్గెట్ చేశారు. ఈ కామెంట్ల ప‌రంప‌ర‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ bjp state president bandi sanjay పేరును ప్ర‌ముఖంగా పేర్కొన‌వ‌చ్చు. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరగ‌డంలో ఆయ‌న ముందుంటున్నారు. కొన్ని సార్లు ఆయ‌న కామెంట్లు వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. అయితే, ఆయ‌న కంటే మ‌రో బీజేపీ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుప‌డుతున్నారు. ఆమె బీజేపీ నాయకురాలు విజయశాంతి vijayashanthi.

విజ‌య‌శాంతి సంచ‌ల‌నం

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పట్ల రాబందులా మారరంటూ విజయశాంతి vijayashanthi సంచలన వ్యాఖ్యలు చేశారు . “తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు… రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా బంద్ అయ్యేలా… సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు. మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం సంగతేమిటో… తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్  ప్రభుత్వానిదే… ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.” అంటూ విజయశాంతి vijayashanti ఫైర్‌ అయ్యారు.

ఇప్ప‌టికే కేసీఆర్ పై క‌ల‌క‌లం

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాతో prime minister narendra modi , home minister amit sha తెలంగాణ సీఎం కేసీఆర్ telangana cm kcr సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంపై అనేక ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ త‌రుణంలో ఓ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విజ‌య‌శాంతి vijayashanthi అలియాస్ రాముల‌మ్మ‌.. మోడీ, కేసీఆర్ modi kcr భేటీపై స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ నేత‌లు టీఆర్ఎస్, trs  సీఎం కేసీఆర్‌పై cm kcr పోరాటాలు చేస్తున్నారు.. కేసీఆర్ kcr మాత్రం ఢిల్లీలో అమిత్‌షాను amit sha క‌లుస్తున్నారు. ప్ర‌ధాని మోడీని modi క‌లుస్తున్నారు ఆయ‌న బీజేపీ హైక‌మాండ్‌తో కూడా మంచి సంబంధాలే కొన‌సాగిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది క‌దా?  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు స‌మ‌యం తీసుకున్నా… లోప‌ల మాత్రం.. మేం త‌ప్పులు చేసినా వ‌దిలేయండి.. సీబీఐ, ఈడీ దాడులు జ‌ర‌గ‌కుండా చూడండి అని చెప్పుకోవ‌డానికే వెళ్లి ఉంటార‌ని వ్యాఖ్యానించారు . ఇలా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ telangana bjp chief bandi sanjay  కంటే విజ‌య‌శాంతి vijayashanthi మ‌రింత ఎక్కువగా విరుచుకుప‌డుతున్నార‌ని ప‌లువురు అంటున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

33 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

56 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago