Eatela Rajendar: ఈట‌ల ఎపిసోడ్ …. అడ్డంగా బుక్క‌యిన కేసీఆర్ మంత్రి ఎవ‌రంటే…

Share

Eatela Rajendar: తెలంగాణ రాజ‌కీయాల్లో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌. అనూహ్య రీతిలో ఆయ‌న మంత్రి ప‌దవి కోల్పోయారు. అదే రీతిలో టీఆర్ఎస్ పార్టీచే టార్గెట్ అవుతున్నారు. ఆ పార్టీ నేత‌లు త‌మ‌దైన శైలిలో ఈట‌ల‌ను ఇరుకున పెడుతున్నారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ మంత్రి ఇప్పుడు విప‌క్షాల‌కు టార్గెట్ అయిపోయారు.

కేసీఆర్ ఆదేశాల‌తో…

ఈట‌ల రాజేంద‌ర్ ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన అనంత‌రం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ మంత్రి గంగుల కమ‌లాక‌ర్ ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా ఆయ‌న నేతల‌తో స‌మావేశం అయ్యారు. అదే స‌మ‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ పై విరుచుకుప‌డ్డారు. ఈట‌ల స‌ముద్రంలో నీటిబొట్టు లాంటి వారంటూ కామెంట్లు చేసేశారు. ఇలా గులాబీ ద‌ళ‌ప‌తి ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటున్న ఆయ‌న ఇప్పుడు విప‌క్షాల‌కు టార్గెట్ అయ్యారు.

ఆ మంత్రిని టార్గెట్ చేసేశారు…

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. సీఎంగా ఉండి రైతులు, ప్ర‌జలు ప‌ట్టించుకోకుండా కాలాయాప‌న చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్ప‌టికైనా మేల్కొని మీ పార్టీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌క్క‌కు పెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైన దృష్టి సారించాలి అని కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్… మీకు పార్టీ, ఎన్నిక‌లు, ఎదురు తిరిగిన నేత‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం త‌ప్ప రాష్ట్రంలో ప్ర‌జ‌లు, రైతులు ప‌డుతున్న క‌ష్టాలు ప‌ట్ట‌డం లేదా? అంటూ లేఖ‌లో నిల‌దీశారు. రాష్ట్రంలో ఐకేపీ సెంట‌ర్ల వ‌ద్ద ధాన్యం కొనుగోలు చేయాల్సిన టీఆర్ఎస్ స‌ర్కార్.. నెల రోజులుగా ప‌ట్టించుకునే పాపాన పోవ‌ట్లేదు.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన‌ సివిల్ స‌ప్లై శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ హుజురాబాద్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కొనే పనిలో రైతుల‌ను మ‌రిచిపోయారంటూ మండిప‌డ్డారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందాన‌ స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప‌నులు మానుకోవాల‌ని లేఖ‌లో హిత‌వు ప‌లికారు.


Share

Related posts

NTR 30 movie: ఎన్టీఆర్ 30వ సినిమాలో ఈ బ్యూటీ ఫిక్స్..!!

bharani jella

Zee Telugu: మరో ఎంటర్ టైన్ మెంట్ షో.. రేణు దేశాయ్ జడ్జి.. శ్యామల, రవి యాంకర్లుగా..!

Varun G

బిగ్ బాస్ 4 : అఖిల్ ని బయటకు పంపేందుకు స్కెచ్ వేసుకుని కూర్చున్న అభిజిత్ ఫ్యాన్స్…! 

arun kanna