హైదరాబాద్ కుషాయిగూడలో దారణం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో చిన్నారి సహా దంపతులు సజీవ దహనం అయ్యారు. టింబర్ డిపోలో అంటుకున్న మంటలు పెను ప్రమాదానికి దారి తీసింది. టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం కారణంగా ఎగిసిన మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. దీంతో అందులో నివసముంటున్న దంపతులు సహా చిన్న కుమారుడు మృతి చెందారు.

టింబర్ డిపోలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలుడుతోనే తీవ్రత పెరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (5) గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కావడంతో ఆ ప్రాంతంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచి వేసింది. సమాచారం తెలియగానే అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ లో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కల్గిస్తున్నాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఓ పక్క పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, ఇళ్లల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీగా అస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. అగ్నిప్రమాదాల నివారణలు అధికారులు పలు సూచనలు చేస్తున్నా తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ సిట్.. వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు