NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad Bypoll: టీఆర్ఎస్ పప్పులు ఉడకలేదు..? ‘ఈటల’కు ఊరట..!!

Huzurabad Bypoll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఎలాగైనా దెబ్బతీయాలని అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో  బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ బల్మూరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి హరీష్ రావుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ నియోజకవర్గంలో తిష్టవేసి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా మొత్తం 61 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

three rajender names nominations rejected from huzurabad bypoll
three rajender names nominations rejected from huzurabad bypoll

Huzurabad Bypoll: టిఆర్ఎస్ పై బీజేపి ఆరోపణ

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు రకరకాల ప్లాన్ లు వేస్తున్నారు. వ్యూహాలకు పదును పెడుతుంటారు. ఈ ప్లాన్ లలో భాగంగా ఎన్నికల్లో ఈటల అభిమానులను కన్ఫ్యూజ్ చేసేందుకు ఓ పథకాన్ని రచించారు. అది ఏమిటంటే .. నామినేషన్ల చివరి రోజున మరో ముగ్గురు ఇ రాజేందర్ లతో నామినేషన్లు దాఖలు చేయించారు. ముగ్గురి ఇంటి పేర్లు ఇ కావడం గమనార్హం. ఈటల రాజేందర్ తో పాటు ఈ ముగ్గురు ఇ రాజేందర్ పేర్లు బ్యాలెట్ ప్యాపర్ పై ఉండటంతో పాటు కమలం గుర్తును పోలిన వేరే గుర్తు వీరికి వస్తే నిరక్షరాస్య ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఓటర్లను గందరగోళానికి గురి చేసేందుకు టీఆర్ఎస్ చేసిన కుట్ర అంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ప్లాన్ ఎవరు రచించినప్పటికీ ఈ ఎత్తుగడ పారలేదు.

రాజేందర్ పేరుతో ఉన్న మూడు నామినేషన్లు తిరస్కరణ

నేడు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరగ్గా 19 నామినేషన్లు తిరస్కరణకు గురైయ్యాయి. తిరస్కరణకు గురైన నామినేషన్ లలో రాజేందర్ పేరుతో ఉన్న ముగ్గురి నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్లు తిరస్కరణకు గురైన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ అభ్యర్థి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థి ఇప్పలపల్లి రాజేందర్ అనే ఈ ముగ్గురు ఇతర జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది. ప్రస్తుతం హూజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!