NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని చుండూరు సభలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎంపీ వెంకటరెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అద్దంకి దయాకర్ ఇంతకు ముందే వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. పార్టీ క్రమశిక్షణా సంఘం కూడా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనే విషయంలో ఆలోచన చేస్తానని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పిలవని పేరంటానికి వెళ్లే వాడిని కాదనీ, తనను నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సమావేశాలకు ఆహ్వానించలేదని వెంకటరెడ్డి పేర్కొన్నారు.

 

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వెంకటరెడ్డికి క్షమాపణలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. చుండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిపైన చేసినా సరికాదని అన్నారు. వెంకటరెడ్డి తనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినందున బేషరతుగా వెంకటరెడ్డికి క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కించపర్చడం తగదన్నారు. అద్దంకి దయాకర్ వాడిన వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ మేరకు క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దృష్టి సారించాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్ పోచారం

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju