టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళి సై కి ఫిర్యాదు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్ లో మంత్రి కేటిఆర్ శాఖ ఉద్యోగులదే కీలక పాత్ర అని ఆరోపించారు. కేటిఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామన్నారు.

వ్యాపం కుంభకోణం లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్న టీఎస్‌పీఎస్సీ చైర్మ్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరికీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామనీ, కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్ కు ఉందని చెప్పారు. పేపర్ లీకేజీ లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనీ, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని ఆరోపించారు. కేటీఆర్, జనార్థన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు అప్లికేషన్ ఇచ్చామని తెలిపారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
జగన్ నివాసంలో సంప్రదాయ బద్దంగా ఉగాది వేడుకలు